Advertisement


Home > Politics - Political News
‘అమ్మ జగనా..’ ఆంధ్రజ్యోతికి ఝలక్!

జగన్ ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రితో సమావేశం అయితే... దానిపై కూడా ఓర్పు లేకపోయింది పాపం. జగన్ ప్రధానిని కలిసింది రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు... కేసుల గురించి అంటూ.. కథనాలను వండారు, వార్చారు. దానికి ‘అమ్మ జగనా’ అంటూ టైటిల్ పెట్టేశారు. దానిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లుగగ్గోలు పెట్టినా పట్టించుకోలేదు. ‘మేమింతే..’ అన్నారు. దీంతో జగన్ పార్టీ కోర్టుకు వెళ్లింది.

కోర్టు పిటిషన్లలో ఆరితేరిన ఆళ్ల పిటిషన్ దాఖలు చేశాడు. ఆంధ్రజ్యోతి యజమానితో సహా ఆ పత్రిక, టీవీ చానళ్ల ముఖ్య ఎడిటర్లపై, పబ్లిషర్లపైనా కోర్టుకు ఎక్కాడాయన. జగన్ ప్రతిష్టకు భంగం కలిగించేలా కథనాలను ప్రచురించారని కోర్టుకు ఫిర్యాదు చేశారు. మరి ఆ ఫిర్యాదుకు అనుగుణంగా విచారణకు హాజరై ఉంటే అదో లెక్క. అయితే ఇది వరకూ ఆ పిటిషన్ విచారణకు వస్తే.. ‘అబ్బే.. అసెంబ్లీ సమావేశాలున్నాయ్ ఇప్పుడు రాలేం..’ అన్నారట.

దీంతో అవాక్కవ్వడం కోర్టు వంతు అయ్యింది. ‘మీరేం ఎమ్మెల్యేలా, ఎమ్మెల్సీలా?’ అనే ప్రశ్న రానే వచ్చింది. తదుపరి విచారణకు అంతా కోర్టు రండి అని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ విషయంలో తనకు వ్యక్తిగతంగా మినహాయింపును ఇవ్వాలని ఆంధ్రజ్యోతి చైర్మన్ రాధాకృష్ణ హై కోర్టుకు వెళ్లాడు. నాంపల్లి కోర్టుకు తను హాజరు కావాల్సిన అవసరం లేకుండా చూడాలని హై కోర్టును కోరారాయన.

అయితే అందుకు ప్రయోజనం దక్కలేదు. ఆర్కే దాఖలు చేసిన పిటిషన్ ను తిరస్కరిస్తూ.. నాంపల్లి కోర్టులో రేపు జరిగే విచారణకు హాజరు కావాలని ఆంధ్రజ్యోతి యజమానిని ఆదేశించింది. మరి ఈ ‘అమ్మ జగనా..’ఎంతవరకూ వెళ్తుందో చూడాలి!