Advertisement


Home > Politics - Political News
భూమా మరణం.. లోకల్‌ జనాలేమంటున్నారు?

ఎంతోమంది రాజకీయ ఉద్ధండులున్నా.. కర్నూలు రాజకీయాల్లో భూమా ఫ్యామిలీ ప్రస్థానం కచ్చితంగా ప్రత్యేకమైనదే. పార్టీలు మారినా, అధికార కూటములకు దగ్గరవుతున్నారని కొంతమంది అంటే అనినా... కొన్ని పార్టీలకు భూమా నాగిరెడ్డి బాగా ఉపయోగపడ్డారు. తెలుగుదేశం పార్టీకి దశాబ్దాల పాటు సేవచేసినా తమకు దక్కిందేమీ లేదని భూమ ఒక సమయంలో వాపోయారు. అలాంటి దశలో మామ ఎస్వీ సుబ్బారెడ్డి మధ్యవర్తిత్వంతో వైఎస్‌తో సాన్నిహిత్యం మొదలైంది. వైఎస్‌ హయాంలో కాంగ్రెస్‌లో చేరాల్సిన భూమా కుటుంబం.. చివరకు వైఎస్‌ సూచన మేరకే ప్రజారాజ్యం వైపు వెళ్లింది. భూమా బలాన్ని తెలుగుదేశం నుంచి లెస్‌ చేశారు వైఎస్‌. అయితే కాంగ్రెస్‌లో చేర్చుకుని తలనొప్పి కొన్ని నియోజకవర్గాల్లో తలనొప్పిని పెంచుకోకుండా.. ప్రజారాజ్యం వైపు వెళ్లమనే సూచన చేసిన చాణక్యం వైఎస్‌ది.

వైఎస్‌ బతికి ఉండగానే మొదలైన 'ప్రజారాజ్యం' విలీనయత్నాన్ని శోభా నాగిరెడ్డి వంటి వాళ్లు మీడియా ముఖంగానే మాట సాయం చేస్తూ వచ్చారు. అయితే ఆ తర్వాత అనూహ్య పరిణామాలు.. ఆరేడేళ్లలోనే విషాధాలు. ఇలాంటి వాటి నేఫథ్యంలో భూమా కుటుంబంపై సానుభూతే ఉంది సీమలో. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మద్దతుదారులు కూడా భూమా కుటుంబంలోని వరస పరిణామాల పట్ల విస్మయానికి గురయ్యారు. పార్టీలతో ప్రమేయం లేకుండా ఇలాంటి విస్మయం వ్యక్తం అయ్యింది.

మరి భూమా మరణ పరిణామాల గురించి కర్నూలు జనాలను కదిలిస్తే.. హైడ్రామా నడిపించిన వైనం గురించి మాట్లాడుతున్నారు. ఆ ఆదివారం ఉదయమే భూమా తీవ్రమైన గుండెపోటుతో మరణించారని.. చనిపోయిన వ్యక్తినే ఆసుపత్రికి తీసుకొచ్చారనేది స్థానిక ప్రజల అభిప్రాయం. ఇక హెలీకాప్టర్‌ అంబులెన్స్‌, చంద్రబాబు క్షణ క్షణ సమీక్ష ఇదంతా ఝూటా. భూమా వైఎస్సార్‌ కాంగ్రెస్‌లో ఉన్న రోజుల్లో ఛాతిలో నొప్పితో బాధపడితే.. పోలీస్‌ కస్టడీ నుంచి వదలని చంద్రబాబు, తీరా చనిపోయాకా హెలీకాఫ్టర్‌ అంబులెన్స్‌ అంటూ హైడ్రామా నడిపించాడని జనాలు అంటున్నారు. ఇదే సమయంలో మరో మాటా అంటున్నారు.. భూమా దంపతులిద్దరూ మరణిస్తే.. వారి పిల్లలు చంద్రబాబు రాజకీయాలకు పావులవుతున్నారని. అయితే ఇదంతా కొంతకాలమే.. తర్వాత బాబు వాళ్లను వదిలించుకునే వైనం కూడా అంతా చూడబోయేదే అనేది టాక్‌ ఆఫ్‌ ది రాయలసీమ.