Home > Politics - Political News
చంద్ర‌బాబు దిగిపోవాల‌ని 70 శాతం ఓట్లు

ఏ విష‌యం గురించైనా ముక్కుసూటిగా మాట్లాడ‌తార‌నే పేరున్న సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయ‌మూర్తి మార్కండేయ క‌డ్జూ ఏపీ సీఎం చంద్ర‌బాబుపై నిప్పులు చెరిగారు. రాజ్యాంగ విలువ‌ల‌ను మంట‌గ‌లుపుతున్న బాబును వెంట‌నే సీఎం ప‌ద‌వి నుంచి స‌స్పెండ్ చేయాల‌ని ట్విట్ట‌ర్ ద్వారా కేంద్ర ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశాడు. ఏపీలోని అప్ర‌జాస్వామిక తెలుగుదేశం ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేసి రాష్ట్ర‌ప‌తి పాల‌న విధించాల‌ని ప్ర‌ధాని, రాష్ట్ర‌ప‌తికి లేఖ‌లు రాశారు.

సోష‌ల్ మీడియా కార్టూనిస్టులు ఇంటూరి ర‌వికిర‌ణ్‌, ఇప్పాల ర‌వీంద్ర‌ల అరెస్ట్‌లు క‌ట్జూకి తీవ్ర ఆగ్ర‌హం తెప్పించాయి. కార్టూన్లు భావ‌వ్య‌క్తీక‌ర‌ణ‌లో భాగ‌మ‌ని, ప్ర‌జాస్వామ్యంలో ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించే హ‌క్కు ప్ర‌తి ఒక్క‌రికీ ఉంటుంద‌ని అంత మాత్రం దానికే అరెస్ట్ చేయ‌డం అప్ర‌జాస్వామికం, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధ‌మ‌ని బాబుపై విరుచుక‌ప‌డ్డారు.

చ‌ట్ట‌విరుద్ధ‌మైన అరెస్ట్‌లు చేస్తున్న ఏపీ పోలీసులకు కూడా క‌డ్జూ గ‌ట్టి హెచ్చ‌రిక‌లు చేశారు. ప్ర‌భుత్వ ఆదేశాల‌ను ముందు వెనుకా చూడ‌కుండా గుడ్డిగా అమ‌లు చేస్తే రెండో ప్ర‌పంచ యుద్ధంలో నాజీల‌కు ప‌ట్టిన గ‌తే ఏపీలో పోలీసుల‌కూ ప‌డుతుందని తీవ్ర స్వ‌రంతో హెచ్చిరించారు.

అంతే కాదండోయ్‌ ఏపీలో రాష్ట్ర‌ప‌తి పాల‌న విధించాలా? వ‌ద్దా? అని త‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌లో ఒక ఒపీనియ‌న్ పోల్ కూడా పెట్టారాయ‌న‌. అందులో దాదాపు 70 శాతం మంది బాబు పాల‌న‌కు మంగ‌ళం పాడాల‌ని ఓటేశారు. కావాలంటే మీరు కూడా ఓటేసి చంద్ర‌బాబు సీఎం ప‌ద‌విలో ఉండాలో లేక దిగిపోవాలో అభిప్రాయం చెప్పొచ్చు.