Home > Politics - Political News
ప‌వ‌న్ ట్వీట్లు అస‌లు ప‌ట్టించుకోవ‌ద్దు

జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ అకౌంట్‌లో పెట్టే పోస్టులను ఏమాత్రం ప‌ట్టించుకోవ‌ద్ద‌ట‌.. ఆయ‌న అకౌంట్‌లో నుంచి ఎలాంటి ట్వీట్లు వ‌చ్చినా అస‌లు లెక్క‌చేయొద్ద‌ట‌.. ఈ మాట అంటున్న‌ది ఏ ప్ర‌త్య‌ర్ధి రాజ‌కీయ‌పార్టీ నేత‌లో, ఇత‌ర హీరో అభిమానులో కాదు.. సాక్షాత్తూ జ‌న‌సేన‌ పార్టీయే.

అదేంటి జ‌న‌సేన పార్టీ ప‌వ‌న్ మాట‌ల‌ను అస‌లు ప‌ట్టించుకోవ‌ద్ద‌న‌డ‌మేమిట‌ని ఆశ్చ‌ర్య‌పోతున్నారా?.. ఏం లేదండీ వాన్నాక్రై దెబ్బ‌కి ప్ర‌పంచంలోని కంప్యూట‌ర్లు, సోష‌ల్ మీడియా అకౌంట్లు హ్యాక్ అయిన సంగ‌తి తెలుసు క‌దా.. మ‌రి ఆ వైర‌స్ మాఫియా ప‌నో లేక మ‌నవాళ్ల ప‌నో తెలియ‌దు కానీ క్రితం ప‌వ‌న్ క‌ల్యాణ్ ట్విట్ట‌ర్ అకౌంట్ హ్యాక‌యింద‌ట.

మూడు రోజుల క్రితం ప‌వ‌న్‌ అకౌంట్ హ్యాక్ అయింద‌ని అందులో ఇప్పుడు ఆయ‌న‌ ఎలాంటి పోస్టులు పెట్ట‌ట్లేద‌ని జ‌న‌సేన చెప్పింది. ఒక‌వేళ అందులో కొత్త‌గా ఏవైనా పోస్టులు ద‌ర్శ‌న‌మిచ్చినా వాటిని ఏమాత్రం ప‌ట్టించుకోన‌వ‌స‌రం లేద‌ని, అవి ప‌వ‌న్ క‌ల్యాణ్ పోస్టులు కాద‌ని తెలిపింది.

ప‌వ‌న్ అకౌంట్ హ్యాక్ చేసింది ఎవ‌ర‌నేది తెలుసుకునేందుకు ఐటీ నిపుణుల‌తో చ‌ర్చిస్తున్నామ‌ని, హ్యాక‌ర్లు ఎవ‌రో తేలితే వారిపై క‌ఠిన చ‌ర్య‌లు కూడా తీసుకుంటామ‌ని కూడా జ‌న‌సేన హెచ్చ‌రించింది. అయితే అకౌంట్ హ్యాక్ కాక‌పోయినా ప‌వ‌న్ ట్వీట్ల‌ను ఎవ‌రూ పెద్ద‌గా ప‌ట్టించుకోరులే అంటూ కొంద‌రు నెటిజెన్లు చ‌తుర్లు విసురుతున్నారు.