Advertisement


Home > Politics - Political News
ఇక ప్రజలవాసి... పవన్

అజ్ఞాతవాసి షూటింగ్ పూర్తయిపోయింది. 150కోట్ల ప్రాజెక్టు కాటట్టి, నిర్మాతకు ఎలాంటి నష్టం వాటిల్ల కూడదు కాబట్టి, పైగా తను 25కోట్ల పారితోషికం తీసుకున్నారు కనుక దానికి న్యాయం చేయాలి కాబట్టి, సిన్సియర్ గా షూటింగ్ చేసేసారు. నిన్నటితో షూటింగ్ అయిపోయింది. సో, ఇక ఇప్పుడు పవన్ ప్రజలవాసి. రాజకీయ రంగంలో కాలూనే కార్యక్రమంలో భాగంగా ప్రజల్లోకి అడుగుపెడుతున్నారు.

తొలుతగా విశాఖ వెళ్లి ప్రభుత్వంపై సమర సంఖం పూరిస్తారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ను ప్రయివేటు చేస్తారన్న భయంతో  ఆ సంస్థ ఉద్యోగి  వెంకటేష్ ఆత్మహత్య చేసకున్నారు. అలాగే కృష్ణానది పడవ ప్రయాణం తెలుగుదేశం ప్రభుత్వం తప్పిదం. భాజపా, తేదేపా ప్రభుత్వాలకు మద్దతు ఇచ్చారు కాబట్టి ఆ ఫ్రమాదాల బాధ్యత తనది కూడా అని పవన్ తన ప్రకటనలో చెప్పుకువచ్చారు.

అందుకే ముందుగా విశాఖ వెళ్లి వెంకటేష్ కుటుంబాన్ని పరామర్శిస్తారు. పడవ బాధితులు, మృతుల కుటుంబాలను కూడా పరామర్శిస్తా అన్నారు కానీ దాని గురించి పెద్దగా వివరించలేదు. కేవలం డిసిఐ సమస్య, నిరుద్యోగం వంటి వాటి గురించే ఎక్కువ ప్రస్తావించారు. పడవ ప్రమాదం గురించి ఎక్కువ ప్రస్తావిస్తే తెలుగుదేశం పార్టీకి కోపం రావచ్చనేమో ?

అదే విధంగా ఉస్మానియా విద్యార్థి మురళి ఆత్మహత్య విషయం కూడా ప్రస్తావించారు కానీ, పోలీసు అంక్షలు వున్నందున పరామర్శకు వెళ్లరట. ఎప్పుడో అంక్షలు తీసాక వెళ్తారట. అంతే కానీ ఓ జన నాయకుడిగా ఆంక్షలు ఎదుర్కోని పరామర్శకు వెళ్తానని పోరపాటున కూడా అనలేదు. కేసిఆర్ తో సమస్య అనేమో?

పనిలో పనిగా తను కూడా గొంతు కలిపిన జనసేన ఛలో ఛలో రే గీతం యూ ట్యూబ్ లో విడుదల చేస్తున్నాం అని పవన్ ప్రకటించేసారు. మొత్తం మీద ఈ కొత్త ప్రకటన, పర్యటన ద్వారా పవన్ మరోసారి కేసిఆర్ మీద, చంద్రబాబు మీద కన్నా, కేంద్రంపై ఫైట్ చేయడానికే ఉత్సాహంగా ముందుకు వస్తారని క్లియర్ అయింది..