Advertisement


Home > Politics - Political News
చంద్రబాబుకు భారతరత్న కోసం పోరాడతా..!

చంద్రబాబుకు భారతరత్న ఇవ్వాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వంతో పోరాడతా.. అని ప్రకటన చేశాడు కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు. అయితే ఇప్పటికిప్పుడు కాదు లేండి.. కొన్ని షరతులున్నాయి. ఆ షరతుల మేరకు చంద్రబాబు నడుచుకుంటే అప్పుడు బాబుకు భారతరత్న అవార్డును ఇవ్వాలని తను డిమాండ్ చేస్తానని, ఆయనకు ఆ అవార్డును దక్కించేందుకు పోరాడుతూ తన శేషజీవితాన్ని గడుపుతానని కేవీపీ ప్రకటించాడు.

మరి కేవీపీ పెట్టిన షరతు ఏమిటంటే.. 2019లోగా పోలవరంను పూర్తి చేయడం. పోలవరం ప్రాజెక్టును అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అంటూ తనబోటి వాళ్లను నిందించడం సబబు కాదు అని కేవీపీ ధ్వజమెత్తాడు. ఈ మేరకు చంద్రబాబుకు ఒక లేఖ రాశాడు. పోలవరం ప్రాజెక్టు ప్రాధాన్యత బాబుకు ఇప్పటికైనా అర్థం కావడం కొంత ఊరట అని కేవీపీ అన్నాడు.

బాబు గతంలో 9యేళ్ల పాటు సీఎంగా ఉన్నప్పుడే పోలవరం ప్రాధాన్యతను అర్థం చేసుకుని ఉంటే మరింత బావుండేదని కేవీపీ అభిప్రాయపడ్డాడు. పోలవరం ప్రాజెక్టుకు తాము ఎలాంటి ఆటంకం కాదని, ఇలాంటి మాటలు మాట్లాడే బదులు పనుల మీద కాన్సన్ ట్రేట్ చేస్తే మంచిది అని బాబుకు సలహా ఇచ్చాడు కేవీపీ. పోలవరాన్ని 2018కే పూర్తి చేస్తాను అని బాబు ప్రకటించిన సంగతి తెలిసిందే.

అయితే 2018కి కాదు 2019కి పూర్తి చేసినా చాలు అని ఈ కాంగ్రెస్ నేత అన్నాడు. ఆ మాత్రం చేసినా బాబుకు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ ను మొదలుపెడతామని కేవీపీ ప్రకటించాడు. మరి బాబుకు భారతరత్న.. ఇందులో రైమింగ్ బాగానే ఉంది. పోలవరాన్ని పూర్తి చేసి బాబు దాన్ని కూడా సాధించుకోవచ్చునేమో!