Advertisement


Home > Politics - Political News
జాతీయగీతానికి జనగణమన పాడండి: కేంద్రం

థియేటర్లో జాతీయ గీతం.. విషయంలో కేంద్ర ప్రభుత్వం తీరు మారింది. ఎందుకొచ్చిన తలనొప్పి అనుకుందో ఏమో కానీ.. దేశ భక్తిలోని గొప్ప అంకం.. అనదగ్గ థియేటర్లో జాతీయగీతం ప్రదర్శన విషయంలో చేతులు ఎత్తేసింది. ఈ విషయంలో తమ ఒత్తిడి ఏమీ లేదు అని.. థియేటర్లో జాతీయ గీతాలపన తప్పనిసరి అనే ఉత్తర్వుల విషయంలో స్టేటస్ కో విధించుకోవచ్చని సుప్రీంకు తెలియజేసింది కేంద్ర హోంశాఖ.

తప్పనిసరిగా జాతీయ గీతాలపన చేయాలని, జాతీయగీతం ఆలపిస్తున్నప్పుడు థియేటర్లని వాళ్లంతా సీట్లలోంచి నిలబడాలన్న.. నియమం విషయంలో తమకు పట్టింపు ఏమీ లేదని కేంద్ర స్పష్టం చేసినట్టు అయ్యిందిప్పుడు. 2016నవంబర్ నెలలోనేమో థియేటర్లో జాతీయ గీతాలపన తప్పనిసరి.. అనే ఆదేశాలు వచ్చాయి కోర్టు నుంచి. ప్రతి సినిమా ప్రదర్శనకు ముందునా.. జనగణమన ప్లే చేయాలని, అందరూ నిలబడాలని కోర్టు స్పష్టం చేసింది. అది నానారచ్చకూ కారణం అయ్యింది.

థియేటర్లో జాతీయగీతాలపన ఏమిటి? అని కొంతమంది కొశ్చన్ చేశారు. మరికొందరు తమ దేశభక్తిని నిరూపించుకోవడానికి ఇంతకు మించిన అవకాశం లేదని ఫీలయ్యారు. ఆఖరికి ఇది ఎంతవరకూ వెళ్లిందంటే.. థియేటర్లో జనగణమన ప్లే అయ్యేటప్పుడు నిలబడలేదు అని.. కొంతమందిపై దాడులు కూడా జరిగాయి. ఒకరిద్దరు వికలాంగులపై కూడా అలాంటి దాడులు జరగడంతో.. దీని వల్ల మంచి ఫలితాల కన్నా, చెడు ఫలితాలే ఎక్కువ అని స్పష్టం అయ్యింది.

అయితే.. పిల్లిమెడలో గంట కట్టే ధైర్యం ఎవరికీ లేకపోయింది. కానీ గత ఏడాది నవంబర్లో మళ్లీ సుప్రీం కోర్టే ఈ విషయంలో ఘాటుగా స్పందించింది. జాతీయగీతాలపనను తప్పనిసరి చేయడాన్ని కోర్టు తప్పు పట్టింది. సినిమాకు వచ్చేది వినోదం కానీ, దేశభక్తిని నిరూపించుకోవడానికి కాదు. థియేటర్లలో వినోదభరితమైన హంగామా ఉంటుంది.. అలాంటి చోట జాతీయగీతాలపన చేయడమే తప్పు అన్నట్టుగా కోర్టు వ్యాఖ్యానిస్తూ.. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది.

ఈ నేపథ్యంలో కేంద్రం ఇప్పుడు స్పందించింది. ఈ తలనొప్పిని వదిలించుకోవాలన్నట్టుగా.. జనగణమన తప్పనిసరి.. అనే ఉత్తర్వులపై స్టే విధించుకోవచ్చని కోర్టుకు సూచింది కేంద్ర హోంశాఖ. మరి ఇకపై ఈ వ్యవహారం ఎటువైపు మలుపులు తిరుగుతుందో చూడాలి!