Advertisement


Home > Politics - Political News
పవన్‌కళ్యాణ్‌పై రోజా 'పంచ్‌' పడిందిగా.!

వైఎస్‌ జగన్‌ని విమర్శిస్తే, వైఎస్సార్సీపీ నేతలు ఊరుకుంటారా.? ఊరుకోరు. అందునా, పవన్‌కళ్యాణ్‌ చేసే విమర్శలకు రోజా కౌంటర్‌ ఇవ్వకుండా వుంటారా.? ఛాన్సే లేదు. ప్రత్యక్షంగా, పరోక్షంగా పంచ్‌ డైలాగుల్ని జగన్‌ మీద పవన్‌ పేల్చితే, రోజా నుంచి ఇన్‌డైరెక్ట్‌ ఎటాక్‌ ఏమీ లేదు.. డైరెక్ట్‌ ఎటాకే షురూ అయ్యింది. 

కృష్ణా నదిలో పడవ బోల్తా పడితే, నెల రోజులకుగానీ, పవన్‌కళ్యాణ్‌కి మెలకువ రాలేదాయె. ఇదే విషయాన్ని రోజా ప్రశ్నించారు. అంతేనా, చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడైన వేమూరి రాధాకృష్ణకి చెందిన ఆంధ్రజ్యోతి కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగితే, హుటాహుటిన అక్కడికి వెళ్ళిన చంద్రబాబుకి, ప్రజల ప్రాణాలంటే అంత చులకనా.? అని రోజా ప్రశ్నించడం గమనార్హం. ఇది కూడా పాయింటే కదా.! 

గోదావరి పుష్కరాలతో మొదలెడితే, కృష్ణా నదిలో పడవ గల్లంతు దాకా.. ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమైన దారుణమైన ఘటనలు చాలానే జరిగాయి. వాటిపై ఎప్పుడూ పవన్‌కళ్యాణ్‌ స్పందించిందే లేదాయె. సరే, డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ప్రైవేటీకరణని పవన్‌కళ్యాణ్‌ ప్రశ్నిస్తే మంచిదే. కృష్ణా నదిలో బోటు ప్రమాదం కారణంగా మృతి చెందినవారి కుటుంబాల్ని పరామర్శించడాన్నీ తప్పు పట్టలేం. 

కానీ, ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ, పోలవరం ప్రాజెక్ట్‌, రాజధాని నిర్మాణం.. ఇలా ముఖ్యమైన అంశాలకు సంబంధించి ఇటు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్నీ, అటు కేంద్రాన్నీ ప్రశ్నించకుండా.. మధ్యలో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ని విమర్శిస్తే, ప్రజలకు ఏం లాభం జరుగుతుందని పవన్‌కళ్యాణ్‌ ఆశిస్తున్నారో ఏమో.! 

ఒక్కటి మాత్రం నిజం.. పవన్‌కళ్యాణ్‌ జనంలోకి వచ్చినప్పుడల్లా నాలుగు పంచ్‌ డైలాగులు పేల్చుతున్నారు.. నలభై నాలుగు విమర్శల్ని ఎదుర్కొంటున్నారు. అది ఆయనకి అలవాటైపోయింది. ఏం చేస్తాం.. ఆయనంతే, మారడుగాక మారడు. చంద్రబాబు కళ్ళతో తప్ప, ఏదీ తన కళ్ళతో చూడకూడదని పవన్‌కళ్యాణ్‌ ఒట్టేసుకున్నాడేమో.!