Advertisement


Home > Politics - Political News
పవన్‌ 'ప్యాకేజీ' యాత్రతో ఒరిగేదేంటి.?

సినీనటుడు పవన్‌కళ్యాణ్‌ తెలుగు రాష్ట్రాల్లో 'యాత్రలకు' శ్రీకారం చుట్టారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్ర నుంచి ఈ యాత్ర ప్రారంభమవుతుందట. దఫ దఫాలుగా ఈ యాత్రలు వుంటాయని క్లారిటీ ఇచ్చేశారండోయ్‌.! యాత్రలు సరే, రాజకీయాల్లో జనం దగ్గరకు వెళ్ళడం అనేది ఆయా పార్టీల హక్కు కావొచ్చు. కానీ, ఆ యాత్రల వల్ల ప్రజలకు ఒరిగేదేంటి.? అన్నదే కీలకం ఇక్కడ.! 

నిజానికి, పవన్‌కళ్యాణ్‌ ఈ యాత్రల్ని ఎప్పుడో ప్రారంభించేశారు. రాజధాని అమరావతిలో రైతులకు మద్దతుగా యాత్రలు చేశారు.. ఉత్తరాంధ్రలో కిడ్నీ బాధితులకు అండగా వుంటానని చెప్పి యాత్రలు చేశారు.. సో, ఇప్పుడు ప్రకటించిన యాత్రల్ని కొత్తగా భావించాల్సిన అవసరం లేదు. విశాఖ వెళ్తారు, డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నినదిస్తారు. ఆగిపోతుందా ఆ ప్రైవేటీకరణ.? ఛాన్సేలేదు. ఎందుకంటే, ఇక్కడ పవన్‌కళ్యాణ్‌కి సీరియస్‌నెస్‌ లేదు. 

కృష్ణానదిలో ఇటీవల జరిగిన పడవ ప్రమాదం కారణంగా మృతిచెందినవారి కుటుంబాల్నీ పవన్‌ పరామర్శిస్తారట. మహా అయితే, ఇంకొంచెం ఎక్స్‌గ్రేషియా కోసం పవన్‌ డిమాండ్‌ చేయొచ్చు. అంతకు మించి, పవన్‌ అక్కడ మాట్లాడటానికీ ఏమీలేదు. ఎందుకంటే దానికి 'బాస్‌' చంద్రబాబు అనుమతి వుండాలి కదా.! ఎక్స్‌గ్రేషియా డిమాండ్‌ సంగతేమోగానీ, ఈ 'ప్యాకేజీ' టూర్‌కి, చంద్రబాబే స్పాన్సరర్‌ అన్నది రాజకీయ వర్గాల్లో విన్పిస్తోన్న గుసగుసల సారాంశం. 

అక్టోబర్‌ లేదా నవంబర్‌లో జనం మధ్యకు పవన్‌కళ్యాణ్‌.. అని గతంలోనే జనసేన పార్టీ నుంచి ఓ 'లీడ్‌' బయటకు వచ్చింది. అయితే, అప్పటికింకా 'అజ్ఞాతవాసి' సినిమా పనులు పూర్తికాలేదు. లేకపోతే, జగన్‌ పాదయాత్రకు పోటీగా.. అన్నట్టు ఈపాటికే పవన్‌, జనంలోకి వచ్చి వుండేవాడే. రాజకీయాల్లో ఇతర రాజకీయ నాయకులు చేసే యాత్రలు వేరు, పవన్‌కళ్యాణ్‌ యాత్రలు వేరు. ఆయనదంతా వెరైటీ.! 

ఆ మధ్య కాకినాడలో బహిరంగ సభ నిర్వహిస్తే, అక్కడ తొక్కిసలాటలో ఓ వ్యక్తి మృతిచెందడంతో ఆ తరహా సభల్ని పవన్‌కళ్యాణ్‌ పూర్తిగా పక్కన పెట్టేశారు. ఇప్పుడీ యాత్రల విషయమైనా అంతే. జనాన్ని కంట్రోల్‌ చేయలేక, కిడ్నీ బాధిత రోగులందర్నీ ఒక్కచోటకు తీసుకొచ్చి (అదీ సినిమా థియేటర్‌లో), వారితో మాటామంతీ నిర్వహించిన ఘనుడు పవన్‌కళ్యాణ్‌. యాత్రలంటే పవన్‌కళ్యాణ్‌ దృష్టిలో టైమ్‌పాస్‌ వ్యవహారమే.. అంతకు మించిన సీరియస్‌నెస్‌ ఆయనలో వుందని ఎలా అనుకోగలం.?