Advertisement


Home > Politics - Political News
కోర్టును లెక్క చేయని వేమూరి రాధాకృష్ణ

నిత్యం లేస్తే అందరికీ శుద్ధులు చెప్పే మీడియా బాస్ ఆయన.. వీకెండ్ వస్తే.. ఆయన కామెంటరీకి హద్దులంటూ ఏమీ ఉండవు. అంతిమంగా తనకు నచ్చిన వాళ్ల ప్రయోజనాల మేరకు ఆ కామెంటరేటర్ చెలరేగిపోతూ ఉంటారు. మరి అన్ని చెప్పే ఆయన తనదాకా వచ్చే సరికి మాత్రం వేరేలా వ్యవహరిస్తున్నారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై తన పత్రికలో రాసిన, తన చానల్ లో ప్రసారం చేసిన వార్తా కథనాలపై ఆ పార్టీ వాళ్లు కోర్టుకు వెళ్లగా.. విచారణకు కోర్టు పిలుస్తున్నా వేమూరి రాధాకృష్ణ తప్పించుకు తిరుగుతున్నారు. బాధ్యతగల మీడియాధినేతగా తమ మీడియా వర్గంలో ప్రచురితం అయిన కథనాల విషయంలో కోర్టుకు వెళ్లి వివరణ ఇచ్చుకోవాల్సిన ఆయన ఇప్పుడు వ్యవహారాన్ని నాన్ బెయిలబుల్ వారెంట్ వరకూ తెచ్చుకున్నారు.

నేడు(మంగళవారం)కోర్టుకు హాజరు కావాల్సి ఉందాయన. అయితే రాలేదు. ఇది వరకూ ఒకసారి విచారణకు ఆయన రాలేదు. అప్పుడే కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పుడు మరోసారి ఆయన విచారణకు హాజరు కాకుండా తప్పించుకున్నారు. దీంతో.. ఈ సారి న్యాయస్థానం ఆయన పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ‘అమ్మ జగనా..’ అంటూ ఆంధ్రజ్యోతి వారు రాసిన కథనాల విషయంలో ఈ పిటిషన్ పడింది.

వీటి విషయంలో వివరణ ఇచ్చుకోకుండా ఆ పత్రిక ఎండీ తప్పించుకు తిరుగుతున్నారు. నిన్న ఈయన దాఖలు చేసి క్వాష్ పిటిషన్ ను హై కోర్టు తిరస్కరించింది. దాంతో తప్పకుండా కోర్టుకు హాజరు కావాల్సింది. అయితే ఈయన కోర్టును లెక్క చేయడం లేదు. ఎవరో అల్లాటప్పా వాళ్లు ఇలాంటి పని చేస్తే ఏమో అనుకోవచ్చు కానీ.. మీడియా సంస్థలను నడిపిస్తున్న వ్యక్తి ఇలా వ్యవహరించడం మాత్రం విడ్డూరమే.