Home > Politics - Political News
సెక్స్‌ టేప్స్‌: నపుంసకత్వం.. నాన్సెన్స్‌.!

ఉడుకు రక్తం.. ఆపై, చిన్న వయసులోనే బోల్డంత పాపులారిటీ.. ఇకనేం, రెచ్చిపోయాడంతే.! సోషల్‌ మీడియాలో హార్దిక్‌ పటేల్‌కి సంబంధించిన సెక్స్‌ వీడియోలు, వాటితోపాటు పైన పేర్కొన్న కామెంట్స్‌ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. నిజానికి ఈ సెక్స్‌ టేపుల్లో చాలావరకు పాతవే. పటేల్‌ రిజర్వేషన్‌.. అంటూ రోడ్డెక్కి ఆందోళనలు చేస్తోన్న హార్దిక్‌ పటేల్‌కి ఇలాంటి సెక్స్‌ టేప్స్‌ వివాదాలు కొత్త కాదు. ఇప్పుడు మళ్ళీ అవి కొత్తగా ప్రాచుర్యంలోకి వచ్చాయంతే. 

తెలుగునాట ఓ రాజకీయ ప్రముఖుడి పుత్రరత్నానికి సంబంధించి 'స్వీట్‌ మూమెంట్స్‌' తాలూకు ఫొటోలు అప్పట్లో పెద్ద రచ్చ అయిన విషయం విదితమే. అది 'ఫ్రెండ్షిప్‌' మాత్రమే అని సదరు 'పుత్రరత్నం' కొట్టి పారేశాడనుకోండి.. అది వేరే విషయం. సాధారణంగా స్వామీజీలకు ఈ తరహా సెక్స్‌ టేప్స్‌ బెడద ఎక్కువగా వుంటుంది. చాలామంది రాజకీయ నాయకులకు ఈ సెక్స్‌ టేప్స్‌ వివాదాలు అలవాటే. 'కాస్సేపు చిలిపితనం' అంటూ కొందరు ఆఫ్‌ ది రికార్డ్‌గా ముసిముసి నవ్వులు నవ్వేస్తుంటారనుకోండి.. అది వేరే విషయం. 

ఇక, హార్దిక్‌ పటేల్‌ సెక్స్‌ టేప్స్‌ విషయానికొస్తే, గుజరాత్‌ ఎన్నికల నేపథ్యంలో ఇవి కొత్తగా వెలుగు చూడటమే విశేషం. అందుకే, హార్దిక్‌ పటేల్‌ కూడా గట్టిగా స్పందించాడు. 'నాకు పెళ్ళి కాలేదు.. నేను నపుంసకుడ్ని కాను.. ఈ సెక్స్‌ టేప్స్‌ జస్ట్‌ నాన్సెన్స్‌..' అని కొట్టి పారేశాడు. అవును మరి, స్వామీజీలు సెక్స్‌ టేప్స్‌ వివాదాల్లో ఇరుక్కున్న ప్రతిసారీ, 'మేం నపుంసకులం' అని తమకు తామే సర్టిఫికెట్స్‌ ఇచ్చుకుంటారు, ఆ వివాదాల్లోంచి బయటపడేందుకు. 

అన్నట్టు, హార్దిక్‌ పటేల్‌ మీద బోల్డంత నిఘా వుందిప్పుడు. కాంగ్రెస్‌ యువరాజు రాహుల్‌ గాంధీని ఈ మధ్యనే ఓ రహస్య ప్రదేశంలో కలిసి, సూట్‌కేసులకొద్దీ డబ్బుని అతను తీసుకెళ్ళాడని ఆ మధ్య ఓ వీడియో టేపు బయటకొచ్చింది. ఇదంతా, హార్దిక్‌ - కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు ప్రకటించడం ద్వారా తెరపైకొచ్చిన కొత్త రగడ. ముందు ముందు ఈ వ్యవహారం ఇంకెంత ముదిరి పాకాన పడ్తుందోగానీ, రాజకీయాలు మరీ 'వరస్ట్‌గా' తయారయ్యాయనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.?