Home > Politics - Political News
జగన్ రెడీ.. తెలుగుదేశమే తేల్చుకోవాలిక..!

నంద్యాల ఉప ఎన్నికల విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి స్పష్టతను ఇచ్చినట్టుగా తెలుస్తోంది. బై పోల్స్ లో నంద్యాల నుంచి తనేపోటీ చేస్తాను అని గంగుల ప్రతాప్ రెడ్డి ప్రకటించారు. ఈ విధంగా నంద్యాల  బై పోల్స్ విషయంలో వైకాపా అభ్యర్థి ఎవరో క్లారిటీ వచ్చింది.

వైకాపా తరపున మూడు పేర్లు ప్రధానంగా వినిపించినా.. అంతిమంగా జగన్ గంగుల వైపే మొగ్గు చూపాడు. మరి తమ దగ్గర కాసులేమీ లేవు, ఆదరాభిమానాలు మాత్రమే ఉన్నారు అని అంటున్న ప్రతాప్ రెడ్డి పార్టీ బేస్ ను ఆధారంగా చేసుకుని ఏ మేరకు సత్తా చాటతాడో చూడాల్సి ఉంది.

ఇక ఎటొచ్చీ తెలుగుదేశం పార్టీనే ఏమీ తేల్చుకున్నట్టుగా లేదు. భూమానా, శిల్పానా.. అనే విషయం పై బాబు సర్వే చేయిస్తున్నారట! ఎవరిని నిలబెడితే ఏమవుతుందో అనే భయానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? భూమా కుటుంబాన్ని నిలబెడితే సానుభూతి వస్తుందో లేక ఫిరాయింపు రాజకీయం పట్ల జనాలు ఛీత్కరించుకుంటారో…అర్థం కావడం లా. ఇక శిల్పాను నిలబెడితే.. సానుభూతి ప్రశ్నే లేదు. టీడీపీ తన సత్తాను మాత్రమే నిరూపించుకోవాల్సి ఉంటుంది.

మాటలు చెప్పినంత ఈజీ కాదు గా సత్తా చాటడం. అందుకే.. తెలుగుదేశం పార్టీ అధినేత ఏమీ తేల్చలేకపోతున్నట్టున్నాడు. ఏదేమైనా.. రసవత్తర ఎన్నికలే ఇవి. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం ఓడితే.. కౌంట్ డౌన్ మొదలైనట్టే!