Advertisement

Advertisement


Home > Sports - Cricket

డైరెక్ట్‌ ఎటాక్‌: బ్యాటుతోనూ, గ్లామర్‌తోనూ.!

డైరెక్ట్‌ ఎటాక్‌: బ్యాటుతోనూ, గ్లామర్‌తోనూ.!

ఫ్రెండ్స్‌తో సరదాగా దిగిన ఓ పర్సనల్‌ ఫొటోని సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో 'ట్రాలింగ్‌'కి గురయ్యింది భారత మహిళా క్రికెట్‌ కెప్టెన్‌ మిథాలీ రాజ్‌. క్రికెట్‌లో ఆమె ఓ సంచలనం. ఆమెను క్రికెటర్‌గా ఆరాధించేవారు కోట్లాది మంది వున్నారు. తృటిలో ప్రపంచ కప్‌ మిస్సయ్యిందిగానీ, లేకపోతే మిథాలీ రాజ్‌ ఇప్పటి ఫాలోయింగ్‌కి పదింతల ఫాలోయింగ్‌ సంపాదించుకుని వుండేదే.! 

ఇక, గతంలో తన ఫొటోని నెటిజన్లు ట్రాలింగ్‌ చేసిన దరిమిలా, వాటికి కౌంటర్‌ ఇచ్చేందుకా.? అన్నట్లు ఓ హాట్‌ ఫొటోసెషన్‌కి 'సై' అనేసింది మిథాలీ రాజ్‌. ఆ హాట్‌ ఫొటోసెషన్‌లోనిదే ఈ ఫొటో. సోషల్‌ మీడియాలో ఇప్పుడీ ఫొటో సెషన్‌కి సంబంధించిన ఫొటోలు ఓ రేంజ్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. చేతిలో బ్యాట్‌ పట్టుకుని, అచ్చం సినిమా హీరోయిన్‌లా గ్లామర్‌ ఒలకబోసేసింది మిథాలీ రాజ్‌. 

గ్లామర్‌ అంటే యాటిట్యూడ్‌.. అది అంగాంగ ప్రదర్శన మాత్రం కాదు.. 'పాపం' అసలే కాదంటారు కొందరు అందాల భామలు. ఆ సంగతేమోగానీ, తన ఆటతో విమర్శకుల నోళ్ళు ఎప్పుడో మూయించేసిన మిథాలీ రాజ్‌, బ్యాట్‌ చేతపట్టి గ్లామరస్‌ ఫొటోసెషన్‌తో.. ట్రాలర్స్‌పై 'డైరెక్ట్‌' ఎటాక్‌కి దిగినట్లుంది కదూ.!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?