Advertisement

Advertisement


Home > Sports - Cricket

ఆస్ట్రేలియాకు గంగూలీ ఘాటైన సమాధానం..!

ఆస్ట్రేలియాకు గంగూలీ ఘాటైన సమాధానం..!

టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ తీరు గురించి కామెంట్స్ చేసిన ఆస్ట్రేలియన్ మాజీ క్రికెటర్లకు భారత క్రికెట్ జట్టు మాజీకెప్టెన్ సౌరవ్ గంగూలీ ఘాటైన రిప్లై ఇచ్చాడు. ఆసీస్ ఓపెనర్ రెన్షాని కొహ్లీ స్లెడ్జ్ చేసిన తీరుపై ఆసీస్ మాజీలు తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. ఇయాన్ హిలీ, మార్క్ వా, మాథ్యూ హైడెన్ ఈ జాబితాలో ఉన్నారు. హిలీ అయితే.. ఒక అడుగు ముందుకు వేసి.. కొహ్లీపై తనకు గౌరవం పోయిందని అనేశాడు.

ఇలా రెచ్చిపోతున్న ఆసీస్ వాగుడుకాయలకు బెంగళూరు టెస్టు విజయానంతరం భారతీయులు గట్టిగానే సమాధానం ఇస్తున్నారు. ముందుగా స్పందించిన సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ.. వాళ్ల వ్యాక్యలను లెక్క చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశాడు. హిలీ, మార్క్ వా, హైడెన్ లతో తను ఆడానని.. మైదానంలో వారి ప్రవర్తన ఎలా ఉండేదో తనకు తెలుసు అని.. అలాంటి వారికి నీతులు చెప్పే అర్హత లేదని దాదా అన్నాడు.

మైదానంలో కొహ్లీ తీరును తను వంద శాతం సమర్థిస్తానని సౌరవ్ అన్నాడు. కెప్టెన్ గా తనను కొహ్లీతో పోలిస్తే తను కొహ్లీలో సగమే.. అని కూడా సౌరవ్ అనడం విశేషం. అలాగే హిలీ వ్యాఖ్యల పట్ల కొహ్లీ కూడా స్పందించాడు. హిలీ తో తను పాఠాలు నేర్చుకునే పరిస్థితి లేదని.. యూట్యూబ్ లో హిలీ ఆటకు సంబంధించిన పాత వీడియోలను చూస్తే.. ఆయన  తీరెంత దారుణంగా ఉంటుందో అర్థం అవుతుందని.. కొహ్లీ చురకలంటించాడు.

ఈ సంగతిలా ఉంటే.. ఆసీస్ కెప్టెన్ స్మిత్ బెంగళూరు టెస్టు  రెండో ఇన్నింగ్స్ లో తను ఔటయ్యాక వ్యవహరించిన తీరుపై విమర్శలు రేగుతున్నాయి. పొరపాటు చేశాను అని స్మిత్ .. అంటున్నప్పటికీ.. తను చేసిన తీవ్రమైన తప్పిదంతో తమ వాళ్లను డిఫెన్స్ లో పడేశాడు స్మిత్. బెంగళూరు టెస్టులో టీమిండియా విజయంతో సీరిస్ మరింత రసవత్తరంగా మారింది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?