Advertisement

Advertisement


Home > Sports - Cricket

ఐపీఎల్‌ బెట్టింగ్‌లు తగ్గాయా?

ఐపీఎల్‌ బెట్టింగ్‌లు తగ్గాయా?

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ పుణ్యమా అని బెట్టింగ్‌ కింగ్‌లకి గిరాకీ పెరిగిపోయింది. కోట్ల రూపాయల్లో టర్నోవర్‌ జరుగుతోంది. దేశమంతా ఐపీఎల్‌ ఫీవర్‌లో మునిగిపోతే, కోట్లు దండుకున్నారు బెట్టింగ్‌ నిర్వహించేవారు. కానీ అది గతం. ఇప్పుడు పరిస్థితులు ఏమాత్రం బాగాలేవని బెట్టింగ్‌తో కాస్త టచ్‌ వున్నవారు అంటున్నారు.

గతంలోలా ఐపీఎల్‌ అంటే ఇంట్రెస్ట్‌ క్రికెట్‌ అభిమానుల్లో పెద్దగా కనిపించడంలేదట. జస్ట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అని చూసి ఊరుకుంటున్నారు చాలామంది. ఐపీఎల్‌లో ఫిక్సింగ్‌ వెలుగు చూశాక, ఆ ప్రభావం బెట్టింగ్‌పై చాలా పడిందని కామన్‌ క్రికెట్‌ ఆడియన్స్ అనుకుంటున్నాడు. అందులో నిజం లేకపోలేదు. పూర్తిగా బెట్టింగ్‌ జరగడంలేదనడం సబబు కాదు. బెట్టింగ్‌ ఇప్పటికీ ఓ మోస్తరుగా జరుగుతున్నా, ఇదివరకటితో పోల్చితే కాస్త తగ్గిందన్నది నిర్వివాదాంశం.

రోజువారి మ్యాచ్‌లతో పోల్చితే, వీకెండ్‌లో జరిగే మ్యాచ్‌లకు క్రికెట్‌ అభిమానుల్లో ఇంట్రెస్ట్‌ పెరుగుతోంది. ఇంకోపక్క, ఐపీఎల్‌ దెబ్బకి సినీ రంగం కుదేలవుతుందని అంతా ముందే అంచనా వేస్తే, వారి అంచనాలూ తల్లకిందులయ్యాయి. ఏం చేసినా బెట్టింగ్‌లను కంట్రోల్‌ చేయడం ఐపీఎల్‌ నిర్వాహకుల వల్ల కాలేదుగానీ, ఊహించని రీతిలో బెట్టింగ్‌ కాస్త తగ్గుముఖం పట్టడం ఆహ్వానించదగ్గ విషయమే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?