Advertisement

Advertisement


Home > Sports - Cricket

ఐర్లాండ్‌పై సఫారీ.. సూపర్‌ విక్టరీ.!

ఐర్లాండ్‌పై సఫారీ.. సూపర్‌ విక్టరీ.!

ఐర్లాండ్‌ మట్టికరిచింది.. సౌతాఫ్రికా ఘనవిజయం సాధించింది. వరల్డ్‌ కప్‌లో భాగంగా నేడు ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా అలవోకగా విజయాన్ని అందుకుంది. ఏ దశలోనూ ఐర్లాండ్‌, సౌతాఫ్రికాను అడ్డుకోలేకపోయింది. బౌలింగ్‌, బ్యాటింగ్‌.. అన్ని విభాగాల్లోనూ ఐర్లాండ్‌ ఫెయిలయితే, ఎక్కడా ఛాన్సివ్వకుండా భారీ విజయాన్ని మూటగట్టుకుంది సౌతాఫ్రికా.

తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 411 పరుగులు చేసింది. ఓపెనర్‌ హషీమ్‌ ఆమ్లా 128 బంతుల్లో 159 పరుగులు చేశాడు. డికాక్‌ ఒక్క పరుగుకే ఔట్‌ కాగా, డికాక్‌ ప్లేస్‌లో వచ్చిన డుప్లెసిస్‌ కూడా సెంచరీ నమోదు చేయడం గమనార్హం. ఈ వరల్డ్‌ కప్‌లో సూపర్‌ ఫామ్‌తో వున్న డివిలియర్స్‌ 9 బంతుల్లో 24 పరుగులు చేసి ఔట్‌ కాగా, మిల్లర్‌ 23 బంతుల్లో 46, రిలీ రసౌ 30 బంతుల్లో 61 పరుగులు చేయడంతో ఐర్లాండ్‌ ముందు భారీ లక్ష్యం వుంచగలిగింది సౌతాఫ్రికా.

భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో అడుగడుగునా తడబడింది ఐర్లాండ్‌. ఏ దశలోనూ ఐర్లాండ్‌ బ్యాట్స్‌మన్‌, సౌతాఫ్రికా బౌలర్లపై పై చేయి సాధించలేకపోయారు. అయితే 45 ఓవర్లను ఆడటం ఐర్లాండ్‌కి సంబంధించి విశేషమే మరి. 45 ఓవర్లలో 210 పరుగులు చేసి ఐర్లాండ్‌ ఆలౌట్‌ అయ్యింది. 201 పరుగులతో సౌతాఫ్రికా, ఐర్లాండ్‌పై విజయం సాధించగా, హషీమ్‌ ఆమ్లా మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డ్‌ గెలుచుకున్నాడు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?