Advertisement

Advertisement


Home > Sports - Cricket

కంగారూల తోక వంకర

కంగారూల తోక వంకర

క్రికెట్‌లో ఆస్ట్రేలియా 'చీటింగ్‌ ట్రిక్స్‌' గురించి తెలియనిదెవరికి.? కనుసైగతో అంపైర్లను శాసించడంలో ఆస్ట్రేలియా క్రికెటర్ల రూటే సెపరేటు. డీఆర్‌ఎస్‌ సిస్టమ్‌నీ భ్రష్టు పట్టించేసింది ఆసీస్‌ టీమ్‌, ఇండియా టూర్‌లో. రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోయాక కూడా, ఇంకా బుకాయింపులు మాత్రం ఆపడంలేదు, ఆసీస్‌ టీమ్‌ కెప్టెన్‌ స్మిత్‌. 'అది పొరపాటు మాత్రమే.. పదే పదే ఆ తప్పు జరిగిందనే ఆరోపణలు సబబు కాదు..' అంటూ స్మిత్‌ తాజాగా నోరు పారేసుకున్నాడు టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ పైన. 

బ్యాట్స్‌మెన్‌ ఎవరైనాసరే, ఔటయ్యాక.. అది ఔట్‌ కాదని తనకు అన్పిస్తే, రివ్యూ కోరేందుకు అవకాశముంది. ఆ అవకాశాన్ని వినియోగించుకునే క్రమంలో ఫీల్డ్‌లో వున్న ఇంకో బ్యాట్స్‌మెన్‌ సలహా తీసుకోవచ్చు. బౌలర్‌ అయితే, కెప్టెన్‌ని కోరవచ్చు. అయితే, ఇక్కడే ఆసీస్‌ జట్టు వెకిలి వేషాలు వేసింది. 'డ్రెస్సింగ్‌ రూమ్‌' వైపు చూసి, అట్నుంచి సలహాలు తీసుకుంది. ఈ ఎపిసోడ్‌లో స్మిత్‌ అడ్డంగా దొరికేశాడు. 

ఈ వ్యవహారంపై కోహ్లీ ఫిర్యాదు మేరకు, బీసీసీఐ సీరియస్‌గా స్పందించింది. ఐసీసీకి ఫిర్యాదు చేసింది కూడా. అయితే, క్రికెట్‌ ఆస్ట్రేలియా రంగంలోకి దిగి, రాజీకొచ్చింది. 'వివాదాన్ని పెంచి పోషించొద్దు..' అంటూ క్రికెట్‌ ఆస్ట్రేలియా బతిమాలుకోవడంతో, బీసీసీఐ వెనక్కి తగ్గింది. బీసీసీఐ నిర్ణయాన్ని కోహ్లీ కూడా గౌరవించాడు. ఆట అన్నాక అవన్నీ సహజమేననీ, అన్నీ మర్చిపోయి.. ఆసీస్ జట్టుతో మైదానంలో మరింత హుందాగా వ్యవహరిస్తామని కోహ్లీ చెప్పాడు. ఇక్కడితో ఈ వివాదానికి కోహ్లీ ముగింపు పలికే ప్రయత్నం చేస్తే, స్మిత్‌  మాత్రం మరోమారు కెలికాడు. 'ఒకే ఒక్కసారి పొరపాటు జరిగింది, కోహ్లీ మాత్రం పదే పదే తాము తప్పు చేసినట్లు ఆరోపిస్తున్నాడు.. అతని ఆలోచనా విధానం తప్పు..' అంటూ కోహ్లీపై విరుచుకుపడుతున్నాడు. 

కంగారూల తోక మొదటి నుంచీ వంకరే. ఈ విషయంలో బీసీసీఐ కాస్తంత కఠినంగానే వ్యవహరించి వుండాల్సింది. అప్పుడు స్మిత్‌ బండారం బయటపడేది కదా.!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?