Advertisement

Advertisement


Home > Sports - Cricket

కోహ్లీ వర్సెస్‌ మిథాలీ: తేడా అదే

కోహ్లీ వర్సెస్‌ మిథాలీ: తేడా అదే

మొన్నీమధ్యనే ఛాంపియన్స్‌ ట్రోఫీని చేజార్చుకుంది టీమిండియా. ఇప్పుడు వరల్డ్‌ కప్‌ని చేజార్చుకుంది టీమిండియా. ఛాంపియన్స్‌ ట్రోఫీని కోల్పోయిన టీమిండియా పురుషులదైతే, వరల్డ్‌ కప్‌ని చేజార్చుకున్నది మహిళల టీమిండియా. కోహ్లీ సేన ఛాంపియన్స్‌ ట్రోఫీని కోల్పోతే దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. అదే, మిథాలీ సేన వరల్డ్‌ కప్‌ని కోల్పోతే ప్రశంసలు దక్కుతున్నాయి.! తేడా ఏంటి.? 

గెలవాల్సిన మ్యాచ్‌ని కోల్పోయినా మహిళా టీమిండియా భారత క్రికెట్‌ అభిమానుల మనసుల్ని గెల్చుకుంది. 191 పరుగులకి మూడు వికెట్లు.. టార్గెట్‌ జస్ట్‌ 229 పరుగులు మాత్రమే. అయినా, ఒత్తిడికి టీమిండియా తలొగ్గింది. ఫలితం వరల్డ్‌కప్‌ కిరీటం చేజారిపోయింది. అయితేనేం, కోట్లామంది భారతీయ క్రికెట్‌ అభిమానులు సాహోరే మిథాలీసేన.. అంటోంది. ఇదీ, మిథాలసేన సాధించిన ఘనవిజయం. కప్పు కొట్టి వుంటే, ఆ కిక్కే వేరప్పా.! ఆట అన్నాక గెలుపోటములు సహజం కదా.! 

అదే, కోహ్లీ సేన ఛాంపియన్స్‌ ట్రోఫీని చేజార్చుకోవడం విషయానికొస్తే, మ్యాచ్‌ కోల్పోయింది పాకిస్తాన్‌ మీద. గెలుపోటములు సహజమే.. అనుకోవడానికి వీల్లేని పరిస్థితి. ఎందుకంటే, ఇక్కడ కెప్టెన్‌ కోహ్లీ సహా చాలామంది ఆటగాళ్ళు జట్టు ప్రయోజనాలకన్నా, తమ 'ఇగో' శాటిస్‌ఫై చేసుకోవాలనుకున్నారు. అక్కడే వచ్చింది సమస్య అంతా. కోచ్‌ మీద కోపంతో ఛాంపియన్స్‌ ట్రోఫీని చేజార్చుకోవడం, క్షమించరాని నేరంగానే చెప్పుకోవాలేమో. 

ఏదిఏమైనా, మహిళల క్రికెట్‌ అంటే లైవ్‌లో పెద్దగా చూడ్డానికీ భారత క్రికెట్‌ అభిమానులు ఆసక్తిచూపేవారు కాదుగానీ, ఇప్పుడు సీన్‌ మారిపోవడం ఆశ్చర్యకరమే. దేశమంతా ఉగ్గబట్టుక్కూర్చుంది మహిళా టీమిండియా, వరల్డ్‌కప్‌ని కొల్లగొట్టేస్తుందనే ఉత్కంఠతో. ఫలితం ఏదైనాసరే, మిథాలీసేనకి హేట్సాఫ్‌ చెప్పి తీరాల్సిందే. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?