Advertisement

Advertisement


Home > Sports - Cricket

కుక్క కాటుకి చెప్పు దెబ్బ.. తప్పదు మరి

కుక్క కాటుకి చెప్పు దెబ్బ.. తప్పదు మరి

క్రికెట్‌ ఆస్ట్రేలియా పరువు పోతోంది. పోతే పోనీ, అసలంటూ పరువు వుంటే కదా, పోవడానికి.! క్రికెట్‌ని భ్రష్టు పట్టించేసిందే క్రికెట్‌ ఆస్ట్రేలియా. కాబట్టి, క్రికెట్‌లో విలువల గురించి మాట్లాడేటప్పుడు క్రికెట్‌ ఆస్ట్రేలియా పేరెత్తకూడదంతే. 

ఇక, అసలు విషయానికొస్తే ఇండియాలో ఆస్ట్రేలియా జట్టు టూర్‌ క్రీడా స్ఫూర్తికి భిన్నంగా నడుస్తోంది. డీఆర్‌ఎస్‌ వివాదం విషయంలో ఆసీస్‌ కెప్టెన్‌ స్మిత్‌ రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోయాక, ఆసీస్‌ జట్టులో మార్పు ఏదన్నా వస్తుందేమోనని అంతా ఆశించారు. కానీ, 'కుక్క తోక వంంకర..' నైజాన్ని ఆసీస్‌ జట్టు నిస్సిగ్గుగా ప్రదర్శిస్తూనే వుంది. 'పోన్లే, ఎందుకు వివాదాన్ని రాద్ధాంతం చేయడం..' అని బీసీసీఐ ఆలోచించడాన్ని క్రికెట్‌ ఆస్ట్రేలియా చేతకానితనంగా తీసుకున్నట్టుంది. 

మైదానంలో ఎవరన్నా ఆటగాడు గాయపడితే, ప్రత్యర్థి టీమ్‌కి చెందినవారు సైతం.. బాధతో విలవిల్లాడుతున్న ఆటగాడ్ని ఓదార్చుతారు. కానీ, ఆసీస్‌ ఆటగాళ్ళలా వెకిలి చేష్టలు చేయరు. కోహ్లీకి గాయమైతే, ఆ గాయం తర్వాత పలు సందర్భాల్లో (మైదానంలో కోహ్లీ లేకపోయినా) వెటకారాలు చేశారు, వెకిలి చేష్టలతో చిరాకు తెప్పించారు. అన్నిటినీ టీమిండియా నవ్వుతూ భరించింది. ఆసీస్‌ కుక్క తోక వంకర నైజం తెలుసు గనుక, ఆటతోనే సమాధానం చెప్పాలనుకుంది. 

కోహ్లీ మామూలుగానే కొంచెం దూకుడు స్వభావం గల వ్యక్తి. అందుకే, మనసులో ఏదీ దాచుకోలేకపోయాడు. ఆసీస్‌ ఆటగాళ్ళ వెకిలి చేష్టలకి, రిప్లయ్‌ గట్టిగానే ఇచ్చేశాడు. కోహ్లీ విషయంలోనే కాదు, క్రీజ్‌లో పుజారా పాతుకుపోవడం, సాహా సెంచరీ చేయడం.. ఆసీస్‌ ఆటగాళ్ళకి నచ్చలేదు. వీలు చిక్కినప్పుడల్లా వారిద్దరినీ మైదానంలో దూషిస్తూనే వున్నారు. బహుశా, ఆసీస్‌ ఆటగాళ్ళు అలా దూషించడంతోనే పుజారా, సాహా మరింత కసిగా ఆడారేమో.! 

మొత్తమ్మీద, కుక్క కాటుకి చెప్పు దెబ్బ తరహాలో కోహ్లీ మైదానంలోనే సమాధానమిచ్చేశాడు. టీమిండియా విక్టరీకి అతి కొద్ది దూరంలోనే వుంది. ఆసీస్‌ జట్టు పరాజయం అంచున నిలబడింది. మ్యాచ్‌ ఫలితం తేలి, టీమిండియా విజయం సాధిస్తే.. అదీ 'కుక్క కాటుకి అసలైన చెప్పుదెబ్బ' అవుతుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?