Advertisement

Advertisement


Home > Sports - Cricket

కుంబ్లే వేస్టు.. బానిసత్వమే బెస్టు.!

కుంబ్లే వేస్టు.. బానిసత్వమే బెస్టు.!

క్రికెట్‌ అంటే కమిట్‌మెంట్‌ వున్న వ్యక్తి అవసరం లేదు.. కోచ్‌గా వచ్చే భారీ రెమ్యునరేషన్‌ కోసమే టీమిండియాకి కోచ్‌ అవ్వాలనుకునేవారు చాలు.. అలా వచ్చే కోచ్‌, గ్రెగ్‌ ఛాపెల్‌లా శాడిస్టు అయినా సమస్యేమీ లేదు.

ఎందుకంటే, నరనరానా బానిసత్వం జీర్ణించుకుపోయింది మనలో.! అందుకే, క్రికెట్‌ కోసం ప్రాణాల్ని సైతం పణంగా పెట్టిన అనిల్‌ కుంబ్లేని కోచ్‌గా వద్దనుకుంది టీమిండియా. కుంబ్లే తప్ప ఎవరైనాసరే.. అని ప్రస్తుతానికి కోహ్లీ సేన చెబుతోందిగానీ, ఆ వచ్చేటోడు మళ్ళీ ఇండియన్‌ అయితే మాత్రం, ఎక్కువ రోజులు కోచ్‌గా కొనసాగే అవకాశం లేదు. 

రేసులో మాజీ క్రికెటర్‌, ఒకప్పటి టీమిండియా డాషింగ్‌ ఓపెనర్‌ వీరేందర్‌ సెహ్వాగ్‌ వున్నాడు. కానీ, ఏం లాభం.? కుంబ్లేతో పోల్చితే సెహ్వాగ్‌ విసిరే పంచ్‌లను కోహ్లీ సేన తట్టుకోవడం కష్టం. కుంబ్లే చాలా చాలా సౌమ్యుడు. సెహ్వాగ్‌ అలా కాదు. తేడా వస్తే అక్కడికక్కడే కడిగి పారేస్తాడు. సో, ఎట్టి పరిస్థితుల్లోనూ సెహ్వాగ్‌కి టీమిండియా కెప్టెన్‌ కోహ్లీ ఓటేయడుగాక ఓటేయడు. 

మరి, ఈ పరిస్థితుల్లో టీమిండియాకి కోచ్‌గా సేవలందించబోయే కొత్త వ్యక్తి ఎవరు.? ఖచ్చితంగా ఆ వ్యక్తి విదేశీయుడే అవుతాడు. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు. విదేశాలకు చెందినవారైతే ఏదన్నా సమస్య వచ్చినా, 'కాంట్రాక్ట్‌' వుంటుంది గనుక, వచ్చే డబ్బుల కోసం తప్ప కమిట్‌మెంట్‌ అవసరం లేదు.

జట్టు ఎలా పోతే నాకేంటి.? అనుకునే కోచ్‌ మాత్రమే ఇప్పుడు కోహ్లీకి కావాలి.! వచ్చే కొత్త కోచ్ మహా స్ట్రిక్ట్ అయితే మాత్రం, టీమిండియాకి బానిసత్వం తప్పదు. బహుశా అదే కోహ్లీ కోరుకుంటున్నాడేమో. కొంతమంది తప్ప, విదేశీ కోచ్ అంటే దాదాపుగా సర్కస్ లో జంతువుల్ని ఆడించే మాస్టర్ గానే వ్యవహరించడం ఆల్రెడీ చూసేశాం.

ఒక్కటి మాత్రం నిజం. కేవలం కోచ్‌తో పొసగలేదన్న కారణంగా, పాకిస్తాన్‌తో ఫైనల్‌ మ్యాచ్‌ని కావాలని చేజార్చుకున్న టీమిండియాని చరిత్ర క్షమించదు. కుంబ్లే లాంటి వ్యక్తిని కాదనుకోవడం ద్వారా విరాట్‌ కోహ్లీ చారిత్రక తప్పిదం చేశాడు.

ఓసారి మైదానంలో ఆడుతున్న సమయంలో తలకి తీవ్రగాయమైతే, ఆ గాయంతోనే బౌలింగ్‌ చేసి కమిట్‌మెంట్‌ అంటే ఇదీ అని చాటి చెప్పిన కుంబ్లే మీద కోహ్లీ కుప్పిగంతులు.. అత్యంత దారుణం. 

కుంబ్లేకి కోచ్‌ పదవి పెద్ద విషయమేమీ కాదు. కానీ, టీమిండియాకి కుంబ్లే లాంటి కోచ్‌ దొరకడుగాక దొరకడు. కోచ్‌ పదవికి గుడ్‌ బై చెప్పిన అనంతరం సోషల్‌ మీడియాలో కుంబ్లే హుందాగా పెట్టిన పోస్ట్‌, కుంబ్లే ఏ స్థాయిలో 'హ్యుమిలేట్‌' అయ్యాడో చెప్పకనే చెబుతుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?