Advertisement

Advertisement


Home > Sports - Cricket

టీమిండియా టార్గెట్‌ 183

టీమిండియా టార్గెట్‌ 183

టార్గెట్‌ చిన్నదే.. ఛేదించడమే ఇక తరువాయి. భారత బ్యాట్స్‌మెన్‌ అలవోకగా విజయం సాధిస్తారో, గెలవడానికి కాస్త కష్టపడ్తారో, వెస్టిండీస్‌ పోరాట పటిమ ప్రదర్శించి, లీగ్‌ దశను దాటుతుందో తేలాల్సి వుంది.

వెస్టిండీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా బౌలర్వు విజృంభించారు. టీమిండియా బౌలర్ల దెబ్బకి వెస్టిండీస్‌ బ్యాటింగ్‌ లైనప్‌ బెంబేలెత్తింది. 182 పరుగులకు వెస్టిండీస్‌ ఆలౌట్‌ అయ్యింది. భారత బౌలర్లలో షమీకి మూడు వికెట్లు దక్కాయి. జడేజా, యాదవ్‌ చెరో రెండు వికెట్లు పడగొడితే, అశ్విన్‌, మొహిత్‌ శర్మ చెరో వికెట్‌ దక్కించుకున్నారు.

ఇక, వెస్టిండీస్‌ బ్యాటింగ్‌ విషయానికొస్తే, ఒకే ఒక్కడు అర్థ సెంచరీ చేశాడు. అది కూడా చివర్లో వచ్చిన కెప్టెన్‌ జేసన్‌ హోల్డర్‌ కావడం గమనార్హం. మరో ముగ్గురు డబుల్‌ డిజిట్‌ (26, 21, 21, 11) సాధిస్తే, మిగతా బ్యాట్స్‌మెన్‌ ఎవరూ సింగిల్‌ డిజిట్‌ దాటలేకపోయారు.

బౌలింగ్‌లో దుమ్ము రేపిన టీమిండియా, బ్యాటింగ్‌లో సత్తా చూపనవసరంలేదుగానీ, నిర్లక్ష్యం చేయకుండా వుంటే, ఈజీగా టార్గెట్‌ని ఛేదించెయ్యొచ్చు. ఆల్‌ ది బెస్ట్‌ టు టీమిండియా.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?