Advertisement

Advertisement


Home > Sports - Cricket

విరాట్‌ కోహ్లీ.. ది విన్నర్‌.. ది ప్రెసిడెంట్‌.!

విరాట్‌ కోహ్లీ.. ది విన్నర్‌.. ది ప్రెసిడెంట్‌.!

క్రికెట్‌ ఆస్ట్రేలియానే కాదు, ఆస్ట్రేలియన్‌ మీడియా కూడా 'స్లెడ్జింగ్‌'కి పాల్పడుతోంది. క్రికెట్‌కి వెకిలి మకిలిని ఆసీస్‌ క్రికెట్‌ పట్టించేస్తే, తనవంతుగా క్రికెట్‌ చుట్టూ అర్థం పర్థం లేని కథనాల్ని ఆసీస్‌ మీడియా వండి వడ్డించేస్తోంది. ఆసీస్‌తో ఎవరు ప్రత్యర్థులైతే, వారి మీద అవాకులూ చెవాకులూ పేలడం ఆసీస్‌ మీడియాకే చెల్లింది. 

తాజాగా, టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీని ఉద్దేశించి ఆసీస్‌ మీడియా అతన్ని అమెరికా అధ్యక్షుడు 'డోనాల్డ్‌ ట్రంప్‌'తో పోల్చిన విషయం విదితమే. ఆసీస్‌ మీడియా తీరుని ప్రముఖ బాలీవుడ్ నటుడు బిగ్‌-బి అమితాబ్‌ బచ్చన్‌ తీవ్రంగా ఖండించాడు. విరాట్‌ కోహ్లీ మీద ప్రశంసలు గుప్పించాడు. అన్నట్టు, బిగ్‌-బి - ఆసీస్‌ మీడియాకి థ్యాంక్స్‌ చెప్పేశాడు.. అదీ వెటకారంలో భాగంగానే. 'విరాట్‌ కోహ్లీని విన్నర్‌గా అంగీకరించినందుకు థ్యాంక్స్‌.. ది విన్నర్‌.. ది ప్రెసిడెంట్‌ విరాట్‌ కోహ్లీ..' అంటూ సోషల్‌ మీడియాలో స్పందించాడు అమితాబ్‌ బచ్చన్‌. 

ఇండియాలో పర్యటిస్తోన్న ఆసీస్‌ జట్టు, డీఆర్‌ఎస్‌ వివాదాన్ని ఎదుర్కొన్న విషయం విదితమే. కెప్టెన్‌ స్మిత్‌, డీఆర్‌ఎస్‌ వివాదంలో అడ్డంగా బుక్కయిపోయాడు. బీసీసీఐ పెద్దమనసుతో వ్యవహరించి వుండకపోతే, కెప్టెన్‌ స్మిత్‌ పరువు పోయేదే. అయినా, ఆసీస్‌ మీడియా 'కుక్క తోక వంకర' నైజాన్నే ప్రదర్శిస్తోంది. స్మిత్‌ విషయంలో బీసీసీఐ నిర్ణయాన్ని కోహ్లీ సవాల్‌ చేసి వుంటే, ఐసీసీఐ స్మిత్‌పై చర్యలు తీసుకుంటే.. ఆ తర్వాత క్రికెట్‌ ఆస్ట్రేలియా పరిస్థితేంటట.? బహుశా ఆసీస్‌ మీడియా అదే కోరుకుంటోందేమో.!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?