చిట్టి తమ్ముడి పెళ్లి అంటే ఏ అక్కకైనా ఆనందమే. ఎప్పుడో తన చేతులతో ఎత్తుకోని ఆడించిన బుడతడు పెళ్లి కొడుకు అవ్వడం ఎంతో సంబరంగా ఉండకపోదు. అలాంటి అనుభూతులతో ఫుల్ బిజీగా ఉందట. మంచులక్ష్మీ ప్రసన్న.
ఒక పక్క షూటింగ్స్ ఇంకో పక్క తమ్ముడి పెళ్లి పనులు. నాన్నగారితో పాటు మా హడావిడిలో మేం ఉండక తప్పదు కదా. బంధువులందరికీ కబురు పెట్టడం దగ్గర్నుంచీ, ఇంటిల్లి పాదికీ డ్రెస్సులు సెలక్ట్ చెయ్యడమే కాకుండా జరగబోయే సంగీత్ కార్యక్రమం కూడా ఎంతో ఇన్నోవేటివ్‌గా ఉండేలా ప్లాన్ చేస్తుందట.
అసలే మనోజ్ స్నేహితులంతా చిచ్చరపిడుగులు. వాళ్లు సృష్టించే హంగామాకు అంతే ఉండదు. పైగా మనోజ్ చేసే ప్రాక్టికల్ జోక్స్‌తోనూ ఎంతో అల్లరిగానూ ఉంటుంది. ఇక మా ఇంట్లో ఆఖరి పెళ్లి. వాడు ఒక ఇంటివాడయితే జెంటిల్మన్ అయ్యి పోతాడు. మా ఇంట్లో పెళ్లి అంటే ఎంతో ఫోకస్ ఉంటుంది. ఎక్కడా అపశృతులు దొర్లకూడదు. అందుకే పక్కా ప్లానింగ్‌తో మనోజ్ పెళ్లి జరిపించే వరకూ ఒక్కటే టెన్షన్ అని మురిసిపోతుంది మంచు లక్ష్మీ.