రెమ్యూనరేషన్ విషయంలో రవితేజ కొత్త ప్రతిపాదనలు..?

గత కొంతకాలంగా హిట్ అత్యవసరమైన స్థితిలో ఉన్నాడు  రవితేజ. అయితే “పవర్'' సినిమా మినహా ఏదీ రవితేజకు ఊరటను ఇవ్వలేదు. ఇక “కిక్-2' అయితే దాదాపు డిజాస్టర్ అయ్యింది. దీంతో ఆయనపై మరింత ఒత్తిడి…

గత కొంతకాలంగా హిట్ అత్యవసరమైన స్థితిలో ఉన్నాడు  రవితేజ. అయితే “పవర్'' సినిమా మినహా ఏదీ రవితేజకు ఊరటను ఇవ్వలేదు. ఇక “కిక్-2' అయితే దాదాపు డిజాస్టర్ అయ్యింది. దీంతో ఆయనపై మరింత ఒత్తిడి పెరిగింది.

ఒకవైపు మీద పడుతున్న వయసు.. తననే అనుకరిస్తూ దూసుకొస్తున్న హీరోలు… ఎనర్జీ అంటూ తనకున్న ప్రత్యక ఇమేజ్ కు అనేక మంది పోటీ దారులు తయారయ్యారిప్పుడు. దీంతో రవితేజ ఒక సరైన హిట్ తో తన ప్రత్యేకతను నిరూపించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అది కూడా తొందరగా జరగాలి. లేకపోతే ఆయన కెరీర్ ధాటిగా కొనసాగడమే కష్టం అవుతోంది.

మరి ఇలాంటి నేపథ్యంలో రవితేజ తన రెమ్యూనరేషన్ విషయంలో చేసిన మార్పులు ఆసక్తికరంగా ఉన్నాయి. కిక్ పార్ట్ టూ సినిమా దగ్గర నుంచే రవితేజ ఈ మార్పులు తీసుకు వచ్చినట్టు సమాచారం. దీని ప్రకారం… సినిమా విడుదలకు ముందు తన పారితోషకంలో 50 శాతం చెల్లిస్తే చాలంటున్నాడట ఈ హీరో. మొత్తం అమౌంట్ ను సినిమా విడుదలకు ముందే చెల్లించేయాలన్న ఇతర హీరోల కు భిన్నంగా అందులో అర్ధాన్ని ముందే చెల్లించి.. మిగతాది సినిమా విడుదల అయితే తర్వాత మాట్లాడుకొందామనేది రవితేజ ప్రతిపాదన. 

సినిమా విడుదల అయిన తర్వాత తన 50 శాతం రెమ్యూనరేషన్ ఇచ్చేయమనడం కూడా లేదు. సినిమా విడుదల అయ్యాకా.. లాభాలు వస్తే అందులో ఇరవై శాతం తనకు ఇచ్చేయాలనేది రవితజ ప్రతిపాదన. 50 శాతం రెమ్యూనరేషన్ కాదు.. లాభాల్లో 20 శాతం ఇవ్వాలనమాట. మరి నిర్మాతల పాలిట చక్కటి ప్రతిపాదనే. లాభాలు వస్తే మాత్రమే 20 శాతం వాటా ఇస్తారు. లేకపోతే రవితేజ కేవలం సగం రెమ్యూనరేషన్ కే నటించినట్టు అవుతుంది.

అయితే… ఇక్కడ ఒక షరతు ఉంది. అదే కీలకం కూడా. సినిమాను ఆరు నెలల్లోగా పూర్తి చేస్తేనే…రవితేజ ప్రతిపాదనలు వర్తిస్తాయి. ఆరు నెలలకు మించి షూటింగ్ జరుపుకున్నా.. విడుదల కావడం వాయిదా పడినా.. రవితేజకు మొత్తం పారితోషకం చెల్లించాల్సిందే! లాభ, నష్టాలకు సంబంధం లేకుండా… రవితేజకు మొత్తం డబ్బు ఇచ్చేయాల్సిందే. మరి వేగవంతంగా సినమాను పూర్తి చేసే నిర్మాత, దర్శకులకు రవితేజ ప్రతిపాదనలు అర్థవంతమైనవే అవుతాయి. ప్లాన్డ్ గా ఉండే వారికి ప్లస్ పాయింట్లే అవుతాయి!