పెద్ద హీరోల పుట్టిన రోజులకు చిన్న హీరోల సినిమాలు విసెష్ చెప్పే కార్యక్రమం ఒకటి కొత్తగా మొదలయింది. మొన్న చిరు, నాగ్ బర్త్ డేలకు ఇలాగే చాలా సినిమాలు విసెష్ చెబుతూ డిజైన్లు, పోస్టర్లు విడుదల చేసాయి. కోన వెంకట్-నిఖిల్ కలిసి రూపొందిస్తున్న శంకరాభరణం కూడా అలాగే చేసింది.
ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే వచ్చింది. మళ్లీ హడావుడి మొదలు. ఈ సారి నిఖిల్-కోనవెంకట్ కొత్త ప్రయత్నం చేసారట. పవన్ పై ఏకంగా ఓ పాట రాయించేసారు. దానికి పవన్ పర్సనల్ స్టిల్స్ విజువల్స్ గా జోడించారు. పాట చివర్న శంకరాభరణం టీమ్ అని ఓ డిజైన్. దీన్ని ఈ అర్థరాత్రి విడుదల చేస్తారట.
ఇంతకు ముందు పవన్ ఫ్యాన్స్ లో నితిన్ ముందుండేవాడు. ఇప్పుడు ఈ ప్లేస్ తీసుకోవాలని చూస్తున్నట్లున్నాడు నిఖిల్. సినిమా ప్రచారం కోసం కోటి పాట్లు..ఎవరేం అంటారు.మరి కొన్ని గంటల్లో పవన్ ఫ్యాన్స్ కు సర్పైజ్ అని ట్వీట్ చేసాడు నిఖిల్. అది ఇదే. అంతకన్నా ఏమీ కాదు.