ఆవిడ హార్మోనియం వాయిస్తే ఏంటట?

ఎవ్వరూ కూడా ఒక్కసారిగా గొప్పవాళ్ళయిపోరు. ఎంతో సుదీర్ఘ కృషి, ఇంకెన్నో కష్టాలు అనుభవించాకే అందలం ఎక్కుతారు. స్వర్గీయ ఎన్టీఆర్‌ సతీమణి లక్ష్మీపార్వతి గతంలో తన మొదటి భర్త వీరగంధం వెంకట సుబ్బారావు హరికథ చెబుతుంటే…

ఎవ్వరూ కూడా ఒక్కసారిగా గొప్పవాళ్ళయిపోరు. ఎంతో సుదీర్ఘ కృషి, ఇంకెన్నో కష్టాలు అనుభవించాకే అందలం ఎక్కుతారు. స్వర్గీయ ఎన్టీఆర్‌ సతీమణి లక్ష్మీపార్వతి గతంలో తన మొదటి భర్త వీరగంధం వెంకట సుబ్బారావు హరికథ చెబుతుంటే శృతి బాక్స్‌ వాయిస్తూ కూర్చున్న లక్ష్మీ పార్వతి బ్లాక్‌ అండ్‌ వైట్‌లో కనిపిస్తున్న వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. 

ఎంతో చలాకీగా వున్న లక్ష్మీ పార్వతి హుందాగా కూర్చుని శృతి ఇస్తుంటే వీరగంధం వెంకట సుబ్బరావు అలవోకగా కథ చెబుతున్నాడు. ఆ కథ కూడా రొమాంటిక్‌ టచ్‌లో వుండడం విశేషం. వీరగంధం దగ్గర కొన్నాళ్ళు హరికథ నేర్చుకోవడానికి వెళ్ళిన లక్ష్మీపార్వతితతో ఆయన వివాహం జరిగిందని చెబుతారు. శృతి బాక్స్‌ వాయించిన లక్ష్మీపార్వతి తో ఎన్టీఆర్‌ని ఊహించుకున్న ప్రజలకు చెట్టు చెడే కాలానికి కుక్క మూతి పిందెలు కాస్తాయన్న సూక్తి నిజం అనిపించక తప్పదు. 

లక్ష్మీపార్వతి ఎన్టీఆర్‌ భార్యగా ఆయన ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఎంతో రాజసం అనుభవించి, ఇప్పటికీ ఆయన జ్ఞాపకాలతో కాలం వెల్లదీస్తున్న ఆవిడ హార్మోనియం వాయించడంలో తప్పేముంది? వింతగా చెప్పుకోవడం తప్ప!