ప్రభాస్ మూవీ.. ఎలా తీయాలో అర్థం కావడం లేదంట

కథ చెప్పేశాడు. గ్రీన్ సిగ్నల్ అందుకున్నాడు. ఎనౌన్స్ మెంట్ కూడా ఇచ్చేశాడు. ప్రీ-ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్నాడు. సరిగ్గా ఈ టైమ్ కు వచ్చేసరికి సినిమా ఎలా తీయాలో అర్థం కావడం లేదంటున్నాడు దర్శకుడు…

కథ చెప్పేశాడు. గ్రీన్ సిగ్నల్ అందుకున్నాడు. ఎనౌన్స్ మెంట్ కూడా ఇచ్చేశాడు. ప్రీ-ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్నాడు. సరిగ్గా ఈ టైమ్ కు వచ్చేసరికి సినిమా ఎలా తీయాలో అర్థం కావడం లేదంటున్నాడు దర్శకుడు నాగ్ అశ్విన్. మీరు విన్నది నిజమే.. తను అనుకున్న కథతో ప్రభాస్ హీరోగా సినిమా ఎలా తీయాలో అర్థం కావడం లేదంటున్నాడు ఈ డైరక్టర్.

“ప్రభాస్ తో చేయాల్సిన సినిమా లేట్ అవుతోంది. ఈ సినిమా కథ, స్క్రిన్ ప్లే చాలా కొత్తది. వరల్డ్ సినిమాలో తీసి ఉండొచ్చు కానీ ఇండియన్ సినిమాలో మాత్రం మాదే ఫస్ట్ టైమ్. అందుకే ప్రీ-ప్రొడక్షన్ స్టేజ్ లో అందరికీ కొత్తగా ఉంది. ఎలా చేయాలో మా యూనిట్ లో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. అందుకే అందరం ముందు నేర్చుకోవడం స్టార్ట్ చేశాం. నేర్చుకున్న తర్వాత ప్రీ-ప్రొడక్షన్ చేయాల్సి వస్తోంది. అందుకే టైమ్ పడుతోంది.”

ఇలా ప్రభాస్ తో చేయాల్సిన సినిమా ఎందుకు లేట్ అవుతుందో బయటపెట్టాడు దర్శకుడు. ఇంత కొత్త కాన్సెప్ట్ ను హ్యాండిల్ చేయడం చాలా కష్టంగా ఉందంటున్న నాగి.. సినిమా సెట్స్ పైకి వచ్చేసరికి మే లేదా జూన్ నెల వస్తుందని అంటున్నాడు. అందుకే అప్ డేట్ కూడా ఇవ్వట్లేదని తెలిపాడు.

“అప్ డేట్ ఇస్తానని నేనే చెప్పాను. కానీ మళ్లీ నేనే వెనక్కి తగ్గాను. ఎందుకంటే ఇప్పుడు అప్ డేట్ ఇస్తే చాలా ఎర్లీగా ఇచ్చినట్టవుతుంది. రాధేశ్యామ్ రిలీజైన తర్వాత లేదా మా సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత తప్పకుండా అప్ డేట్ ఇస్తా.”

ఆదిపురుష్ సినిమా తర్వాత తన సినిమా రావడం తనకు ప్లస్ అవుతుందంటున్నాడు నాగ్ అశ్విన్. రాముడి కథ కాబట్టి, ఆదిపురుష్ సినిమా మణిపూర్ లాంటి రాష్ట్రాలకు కూడా చేరిపోతుందని.. ఆ తర్వాత తమ సినిమా వస్తే రీచ్ మరో 30శాతం పెరుగుతుందని విశ్లేషిస్తున్నాడు.

సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ తో రాబోతున్న ఈ సినిమాలో భారతీయ సంస్కృతిని తనదైన శైలిలో చూపించబోతున్నాడు నాగ్ అశ్విన్. అది ఎలా ఉంటుందంటే.. ఇతర దేశాల ప్రేక్షకులు కూడా వాళ్ల భాషలో ఈ సినిమాను డబ్ చేసి చూస్తే కనెక్ట్ అవుతారని చెబుతున్నారు. 

టీడీపీ ముచ్చట తీరింది

దేశం మౌనం పాటిస్తోంది