స్టీల్ ప్లాంట్ పై చర్చ.. ఏపీ కేబినెట్ నిర్ణయాలు ఇవే

– అమరావతి పరిధిలో అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలపై చర్చ. వాటిని పూర్తిచేసేందుకు ఏఎంఆర్డీఏకు 3 వేల కోట్ల రూపాయల బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చేందుకు కేబినెట్ నిర్ణయం Advertisement – కాకినాడ సెజ్ భూముల వ్యవహారంలో…

– అమరావతి పరిధిలో అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలపై చర్చ. వాటిని పూర్తిచేసేందుకు ఏఎంఆర్డీఏకు 3 వేల కోట్ల రూపాయల బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చేందుకు కేబినెట్ నిర్ణయం

– కాకినాడ సెజ్ భూముల వ్యవహారంలో రైతులకు నష్టపరిహారం చెల్లించేందుకు నిర్ణయం. కమిటీ సూచించిన నష్ట పరిహారం కంటే కాస్త ఎక్కువే ఇవ్వాలని నిర్ణయించిన మంత్రివర్గం.

– విశాఖ స్టీల్ ప్లాంట్ కు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంపై కేబినెట్ లో కీలక చర్చ. ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించిన మంత్రివర్గం. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి, కేంద్రానికి పంపించాలని నిర్ణయం

– అగ్రవర్ణ మహిళా పేదల కోసం ఉద్దేశించిన ఈబీసీ నేస్తం కింద 670 కోట్లు కేటాయిస్తూ మంత్రివర్గం నిర్ణయం. 45-60 ఏళ్ల మధ్య వయసున్న అగ్రవర్ణ పేద మహిళలకు ఈ పథకాన్ని వర్తింపజేస్తారు. ఒక్కో మహిళకు ఏడాదికి 15వేలు చొప్పున మూడేళ్లకు 45 వేలు.

– నవరత్నాలకు సంబంధించిన క్యాలెండర్ కు మంత్రివర్గం ఆమోదం. ఇకపై టైమ్ టేబుల్ ప్రకారం, సంక్షేమ పథకాల అమలు, లబ్దిదారులకు చేయూత.

– పట్టణ ప్రాంతాల్లో లక్షా 43 వేలమంది లబ్దిదారులకు రూపా

యికే (టిడ్కో ఇళ్లు 300 చదరపు అడుగుల లోపు ఉంటే) రిజిస్ట్రేషన్ పూర్తిచేసి ఇళ్లు అప్పగిస్తారు. ఇళ్ల కోసం తీసుకున్న లక్ష రూపాయల రుణంలో 50వేలు ప్రభుత్వమే చెల్లించాలని కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటు ప్రభుత్వ లే-అవుట్స్ లో 5 శాతం భూమిని పేదలకు కేటాయించాలని నిర్ణయం.

– కడప జిల్లాలో రెండు ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుపై చర్చ. వైఎస్ఆర్ స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం భాగస్వామ్య సంస్థను ఎంపిక చేయాలని నిర్ణయం

– జగనన్న విద్యా దీవెన కింద పూర్తిగా ఫీజు రీఇంబర్స్ మెంట్.

దేశం మౌనం పాటిస్తోంది

టీడీపీ ముచ్చట తీరింది