రామ్ చరణ్ అద్భుతమైన వీడియోను రిలీజ్ చేశాడు. ఇటీవల తండ్రి అయిన ఈ హీరో, పుట్టిన బిడ్డను తొలిసారి తన చేతుల్లోకి తీసుకున్న మధుర క్షణాన్ని వీడియోలో బంధించాడు. ఆ వీడియోను కొద్దిసేపటి కిందట విడుదల చేశాడు.
జూన్ 20న తల్లిదండ్రులయ్యారు ఉపాసన-రామ్ చరణ్. పాప పుట్టి నెల రోజులు అవుతోంది. ఈ సందర్భంగా చరణ్ ఓ వీడియోను విడుదల చేశాడు. తన పెళ్లి నుంచి క్లిన్ కారా పుట్టిన వరకు జరిగిన కొన్ని ఘటనల్ని ఆ వీడియోలో చూపించాడు. పెళ్లయిన 11 ఏళ్లకు బిడ్డకు జన్మనిచ్చిన ఈ హీరో, ఆ టైమ్ వచ్చింది కాబట్టి పాపు పుట్టిందంటూ స్పందించాడు.
వీడియోలో ఎట్రాక్ట్ చేసే మూమెంట్స్ చాలానే ఉన్నాయి. అయితే తొలిసారి పాపను చేతుల్లోకి తీసుకున్న సన్నివేశం మాత్రం హైలెట్. పాపను తన చేతుల్లోకి తీసుకొని, ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు తీసుకొచ్చి చిరంజీవితో పాటు కుటుంబ సభ్యులందరికీ రామ్ చరణ్ చూపించిన సన్నివేశం అది.
పాపను చేతుల్లోకి తీసుకున్న మరుక్షణం, 9 నెలల పాటు పడిన టెన్షన్ మొత్తాన్ని మరిచిపోయానన్నాడు చరణ్. ఈ మధురమైన క్షణంతో పాటు, మరెన్నో ఆసక్తికరమైన విజువల్స్ తో ఈ వీడియోను రూపొందించి, విడుదల చేశారు.