'యోగా బ్యూటీ' అనే పేరున్నా అనుష్క ఇటీవలి కాలంలో తన ఫిజిక్‌పై ఫోకస్ పెట్టలేకపోతోంది. 'ఖలేజా' సినిమాలో మహేష్ పక్కన హెవీగా కన్పించింది అనుష్క. 'మిర్చి' సినిమాలో ప్రభాస్ సరసన కూడా కాస్త అతిగానే కనిపించింది ఫిజిక్ విషయంలో. అందుకే కొన్ని ప్రత్యేకమైన సినిమాల్లో తప్ప, రెగ్యులర్‌గా గ్లామరస్ హీరోయిన్గా అనుష్క సినిమాలు చేయలేకపోతోందన్న వాదనలున్నాయి.
ఆ సంగతెలా వున్నా, తాజాగా అనుష్క 'సైజ్ జీరో' ఫస్ట్ లుక్‌తో అందర్నీ విస్మయానికి గురిచేసింది. ఈ సినిమా కోసం అనుష్క కాస్త వెయిట్ పెరిగిందంటూ ప్రచారమైతే జరిగింది. ఎప్పుడు పెరిగిందో, ఎప్పుడు తగ్గిందో ఎవరికీ తెలియదు. అనుష్క ఇటీవల ఓ ఫంక్షన్‌కి హాజరైనప్పుడు మామూలుగానే వుంది. 'సైజ్ జీరో' ఫస్ట్ లుక్‌లో మాత్రం చాలా హెవీగా కన్పిస్తోంది. 'లడ్డూబాబు' సినిమాలో బండబారిపోయిన అల్లరి నరేష్‌లా కన్పిస్తోంది అనుష్క.
అనుష్క అంటే గ్లామర్.. గ్లామర్ అంటే అనుష్క.. అలాంటి అనుష్కని హెవీగా 'సైజ్‌జీరో' ఫస్ట్ లుక్‌లో చూడలేకపోతున్నారు ఆమె అభిమానులు. గ్రాఫిక్స్, ఇంకా మేకప్ ట్రిక్స్‌తో అనుష్కని హెవీగా చూపించే ప్రయత్నం చేస్తున్నట్లు అన్పిస్తోంది. ఆర్య హీరోగా నటిస్తోన్న ఈ సినిమాకి ప్రకాష్ కోవెలమూడి దర్శకుడు. ఫ్యాన్స్‌ని బాగా హర్ట్ చేసిన అనుష్క, ఓవరాల్‌గా ఆడియన్స్ అటెన్షన్‌ని అయితే 'సైజ్ జీరో'తో తనవైపుకు తిప్పుకుంది. సినిమాకి రావాల్సిన హైప్ వచ్చేసిందనే చెప్పొచ్చు. అయితే అనుష్క రిస్క్ చేసిందేమో.. ఇకపై అనుష్కని గ్లామరస్‌గా చూడలేమేమో.. అని కొందరు అనుమానిస్తున్నారు. అదెంత నిజమో రానున్న రోజుల్లో తేలుతుంది.