సినిమావాళ్లు నోరు విప్పరేంటి?

పార్లమెంటులో తెలుగు గౌర‌వం మంట‌గ‌లుస్తోంది. తెలుగువాళ్లు త‌మ‌లో తాము క‌ల‌బ‌డుతున్నారు. మైకులు విర‌గొట్టుకొంటున్నారు. కంట్లో కారం కొడుతున్నారు. నువ్వెంత‌?  అంటే నువ్వెంత‌? అంటూ కొట్టుకొంటున్నారు. మొత్తానికి తెలుగు సినిమా క్లైమాక్స్‌లోలానే ఓ భారీ యాక్షన్…

పార్లమెంటులో తెలుగు గౌర‌వం మంట‌గ‌లుస్తోంది. తెలుగువాళ్లు త‌మ‌లో తాము క‌ల‌బ‌డుతున్నారు. మైకులు విర‌గొట్టుకొంటున్నారు. కంట్లో కారం కొడుతున్నారు. నువ్వెంత‌?  అంటే నువ్వెంత‌? అంటూ కొట్టుకొంటున్నారు. మొత్తానికి తెలుగు సినిమా క్లైమాక్స్‌లోలానే ఓ భారీ యాక్షన్ ఘ‌ట్టం జ‌రుగుతోంది. అన్ని రాజ‌కీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు ఈ టాపిక్ గురించే మాట్లాడుతున్నాయి. 

తెలంగాణ – సమైఖ్యాంధ్ర‌.. వీటిలో త‌మ మ‌ద్దతు దేనికో స్పష్టంగా చెబుతున్నాయి. ఇంత జ‌రుగుతున్నా – సినిమావాళ్లు ఒక్కరంటే ఒక్కరు కూడా నోరు మెద‌ప‌డం లేదు. మా అభిప్రాయం ఇదీ.. అని ఒక్కరూ స్పష్టంగా చెప్పడం లేదు. తెలంగాణ కావ‌ల‌నో, సమాఖ్యాంధ్ర ఉండాల‌నో ఎవ్వరికీ అభిప్రాయం అంటూ లేదా??   ఏం మాట్లాడితే ఎటు నుంచి ఏం ముప్పు వ‌స్తుందో అని భ‌య‌ప‌డి ఛ‌స్తున్నారు. మ‌న‌సులో ఓ అభిప్రాయం ఉన్నా చెప్పడానికి  ఒక్కరికీ ధైర్యం లేదు. తెలంగాణాకి జై కొడితే సీమాంధ్రలో సినిమా విడుద‌ల కాదు. అదే నో అంటే… నైజాంలో బొమ్మ ప‌డ‌దు. 

అందుకే భేషుగ్గా గోడ‌మీద పిల్లిలా మారిపోయారు. కానీ వాళ్లకీ హ‌డ‌లే. తెలంగాణ వ‌స్తే, రెండు రాష్ట్ర్లాలుగా మారిపోతే – సినిమా ప‌రిశ్రమ ఎక్కడ ఉంటుంది?  రెండు ప‌న్నులు క‌ట్టాలా??  తెలంగాణ‌లో తెలంగాణ‌వారితోనే సినిమాలు తీయాలా?  ఇలాంటి స‌వాల‌క్ష డౌట్లున్నాయి. అయితే ఒక్కరూ బ‌య‌ట ప‌డ‌డం లేదు. ఆఫ్ ది రికార్డ్ – అంటూ తెలంగాణ‌పై త‌మ అభిప్రాయం చెబుతున్నారు త‌ప్పితే – ఒక్కరూ మీడియా ముందు నోరు మెద‌ప‌డం లేదు. వీళ్లకు ధైర్యం సినిమాల్లో త‌ప్ప‌.. నిజ జీవితంలో లేదేమో..?