రెండు సినిమాలు ఒకేసారి

ముగ్గురూ దాదాపు ఒకసారే రంగంలోకి వచ్చారు. కానీ ఒక ఆర్ పక్కకు తప్పుకున్నట్లే. మరో ఆర్ ఇన్సింగ్స్ ఫినిష్ చేసినట్లే. కానీ మూడో ఆర్ మాత్రం ఇంకా ఫీల్డ్ లోనే వుంది. రేజీనా, రకుల్,…

ముగ్గురూ దాదాపు ఒకసారే రంగంలోకి వచ్చారు. కానీ ఒక ఆర్ పక్కకు తప్పుకున్నట్లే. మరో ఆర్ ఇన్సింగ్స్ ఫినిష్ చేసినట్లే. కానీ మూడో ఆర్ మాత్రం ఇంకా ఫీల్డ్ లోనే వుంది. రేజీనా, రకుల్, రాశీఖన్నాల సంగతే ఇది.

ముగ్గురిలో రకుల్ ఫుల్ స్పీడ్ లో దూసుకుపోయింది. దాదాపు అందరు హీరోలను ఓ రౌండ్ వేసేసి, కోలీవుడ్ కు షిఫ్ట్ అయిపోయింది. రెజీనా సరైన ట్రాక్ కుదరక, అలా అలా చేసుకుంటూ వచ్చి, ఇన్నింగ్స్ ముగిసిపోయింది అనేట్లు గా వుంది.

కానీ రాశీఖన్నా మాత్రం ఇంకా స్టడీగా వుంది. స్పీడు లేదు. స్లో లేదు. అలా చేసుకుంటూ వస్తోంది. ఇప్పుడు చేతిలో నాలుగు సినిమాలు వున్నాయి. రెండు తమిళ్, రెండు తెలుగు. ఈ రెండు తెలుగు సినిమాలు వారం గ్యాప్ లో ఒకే నెలలో విడుదలకు రెడీ అయిపోయాయి.

పిబ్రవరి రెండు రవితేజ్ తో టచ్ చేసి చూడు అంటూ వస్తోంది రాశీఖన్నా. మరీ పత్యేకమైన పాత్ర ఏమీ కాదు. జస్ట్ కమర్షియల్ హీరోయిన్ పాత్రనే. అయితే 9న మరో సినిమా వస్తోంది. వరుణ్ తేజ హీరోగా తొలిప్రేమ. ఈ సినిమాలో రాశీ ఖన్నా గెటప్ నే వైవిధ్యంగా వుంది. బబ్లీగా వుంటూ యూత్ ఫుల్ లుక్ కోసం ట్రయ్ చేసినట్లు వుంది.

ఇలా రెండు సినిమాలు ఒకేసారి వస్తున్నాయి. వీటిలో ఒక్క దానికి పేరు వచ్చినా చాలు, రాశీ ఇన్నింగ్స్ మరి కొన్నాళ్లు కొనసాగుతుంది.