సమంత ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో సినిమా. నాని కూడా ఇంచుమించు అదే టైమ్ లో. ఈ సినిమాకు అప్పట్లో మిక్స్ డ్ రెస్పాన్స్ వచ్చింది. నచ్చిన వాళ్లకు సూపర్ గా నచ్చేసింది. నచ్చని వాళ్లకు అబ్బే.. అనిపించింది.
లవ్, రొమాంటిక్ జోనర్ ను బ్రహ్మాండంగా హ్యాండిల్ చేయగల గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన సినిమా అది. ఎటో వెళ్లిపోయింది మనసు. ఇళయరాజా మ్యాజిక్ మ్యూజిక్ వున్న సినిమా. ఆద్యంతం ఇళయరాజా రీ రికార్డింగ్ మ్యాజిక్ నే చేసింది ఆ సినిమాలో.
కానీ కమర్షియల్ గా అంత విజయం సాధించకనో, మరెందుకో, ఇప్పటి దాకా టీవీ చానెల్ లో రాలేదు. యూ ట్యూబ్ లో కూడా ముక్కలు ముక్కులే తప్ప, ఫుల్ లెంగ్త్ సినిమా లేదు. ఇప్పుడు ఈ సినిమాకు మోక్షం వచ్చింది. మాటీవీలో కొత్త సంవత్సరం తొలి వారంలో ఈ సినిమాను ప్రసారం చేయబోతున్నారట.
సమంత తొలినాళ్ల అందాలు నచ్చేవారు, ఇళయరాజా మ్యూజిక్ లైక్ చేసేవాళ్లు మాటీవీని ఫస్ట్ వీక్ లో ఈ సినిమాకోసం వాచ్ చేయడమే.