అందరూ “అ!” అనేలా ఉంటుందట

“అ!” అంటే ఓ ఆశ్చర్యం, ఓ ఆనందం.. ఇంకా చెప్పాలంటే సంభ్రమాశ్చర్యం అంటారు కదా.. అదన్నమాట. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి అలాంటి ఫీలింగ్ కలుగుతుందంటున్నాడు నాని. తనే నిర్మాతగా మారి తెరకెక్కిస్తున్న…

“అ!” అంటే ఓ ఆశ్చర్యం, ఓ ఆనందం.. ఇంకా చెప్పాలంటే సంభ్రమాశ్చర్యం అంటారు కదా.. అదన్నమాట. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి అలాంటి ఫీలింగ్ కలుగుతుందంటున్నాడు నాని. తనే నిర్మాతగా మారి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ప్రతి పాత్ర అదే ఫీలింగ్ కలిగిస్తుందని చెబుతున్నాడు. నిన్న రిలీజ్ చేసిన ఈ మూవీ ఫస్ట్ లుక్ లో చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. 

ఓ కాఫీ కప్పు. అందులో “అ!” అనే టైటిల్ తో పాటు.. చుట్టూ చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ పెట్టాడు దర్శకుడు. అందులో ఒకటి పేపర్ చుట్టి ఉంచిన రివాల్వర్. మరోవైపు అవయవ దానానికి సంబంధించిన అప్లికేషన్ ఫారమ్. దానిపై రెక్కలు తుంచి పడేసిన ఓ గులాబీ. 

కాఫీ కప్పుకు మరోవైపు భగవద్గీత, అటువైపు షుగర్ క్యూబ్స్. ఫస్ట్ లుక్ లో ఎలిమెంట్స్ మాత్రమే కాదు, ఈ సినిమా కోసం నాని సెలక్ట్ చేసుకున్న నటీనటులు కూడా కాస్త సర్ ప్రైజింగ్ గానే ఉన్నారు. అవసరాల శ్రీనివాస్ ఒక్కడే కనిపిస్తున్నాడు. మిగతావాళ్లంతా హీరోయిన్లే. 

నిత్యామీనన్, రెజీనా, ఇషా, కాజల్.. ఇలా అందరూ ముద్దుగుమ్మలే. కాకపోతే సినిమాలో హీరో, హీరోయిన్ అనే కాన్సెప్ట్ లేనట్టుంది. నాని చెప్పినట్టు స్టార్ కాస్ట్ కంటే థ్రిల్లింగ్ ఎలిమెంట్సే ఎక్కువగా ఎట్రాక్ట్ చేస్తాయన్నమాట. ప్రపంచంలో నేను.. నాలోని ప్రపంచం అనే ట్యాగ్ లైన్ ఈ సినిమాకు మరింత కొత్తదనం తీసుకొచ్చింది. అన్నట్టు డిసెంబర్ లో ఈ మూవీ టీజర్ కూడా లాంచ్ చేస్తాడట నిర్మాత నాని.