అలా చేసి వుంటే బాలయ్యకు వచ్చేదా?

నంది అవార్డుల విషయంలో మొత్తానికి స్పందించారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. జ్యూరీ నిర్ణయం ఇలా వివాదం అవుతుంది అనుకుంటే, మొబైళ్ల ద్వారా ఐవిఆర్ సిస్టమ్ లో సర్వే చేయించి అవార్డులు ఇచ్చేవారమని ఆయన అన్నారు. Advertisement…

నంది అవార్డుల విషయంలో మొత్తానికి స్పందించారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. జ్యూరీ నిర్ణయం ఇలా వివాదం అవుతుంది అనుకుంటే, మొబైళ్ల ద్వారా ఐవిఆర్ సిస్టమ్ లో సర్వే చేయించి అవార్డులు ఇచ్చేవారమని ఆయన అన్నారు.

ఇదేదో బాగుంది. జనాలకు ఫోన్ చేసి, ఫలనా నటుడు అయితే ఒకటి నొక్కండి, ఇంకో నటుడు అయితే రెండు నొక్కండి లాంటి ప్రశ్నలతో సర్వే ముగిసేది. నిజానికి నేరుగా జనాలను అడగడం కూడా మంచిదే. మారుతున్న కాలంలో టెక్నాలజీని వాడుకుంటే తప్పు లేదు.

కానీ ఒకటే అనుమానం. అప్పుడు బాలయ్యకు కాకుండా, ఆ ఏడాది మరో హీరో ఎవరికైనా జనం ఎక్కువగా ఓట్లేసి వుండేవారేమో? ఎందుకంటే బాలయ్యకు ఎంత ఫ్యాన్ బేస్ వున్నా, కుర్ర హీరోలకు, (అదే క్యాంప్ అయినా) ఉన్నంత వుండకపోవచ్చు కదా? 

ఏమైనా సరే ఈ అయిడియా బాగుంది, వచ్చేసారి నంది అవార్డులకు ఇలాంటిది ఏదో ట్రయ్ చేస్తే సరి. కానీ పాపం, మనవాళ్లందరినీ జ్యూరీలోకి తోసేసే అవకాశం తప్పిపోతుంది కదా? మురళీ మోహన్ రికమండ్ చేసారనో, మరోకరు చెప్పారనో, జర్నలిస్టులను జ్యూరీలోకి తోసేసే అవకాశం వుండదు కదా? అన్న గుసగసులు కూడా ఈ సందర్భంగా వినిపిస్తున్నాయి.