స్పైడర్‌.. డిజస్టార్లలో దేశ చరిత్రలోనే రెండో స్థానం!

మహేశ్ బాబు స్పైడర్ సినిమా ఫెయిల్యూర్ విషయంలో కొత్త రికార్డు స్థాపించిందనే మాట వినిపిస్తోందిప్పుడు. ఈ సినిమా లాసులు భారీ స్థాయిలో ఉన్నాయట అని అంతా చెప్పుకోవడమే కానీ.. లాసుల విషయంలో ఈ సినిమా…

మహేశ్ బాబు స్పైడర్ సినిమా ఫెయిల్యూర్ విషయంలో కొత్త రికార్డు స్థాపించిందనే మాట వినిపిస్తోందిప్పుడు. ఈ సినిమా లాసులు భారీ స్థాయిలో ఉన్నాయట అని అంతా చెప్పుకోవడమే కానీ.. లాసుల విషయంలో ఈ సినిమా సాధించిన ఫీట్ గురించి పక్కగా తెలీదు. ఈ నేపథ్యంలో కొత్త చర్చ ఒకదానికి తెరలేచింది. దీని సారాంశం ఏమిటంటే.. ఈ సినిమా డిజాస్టర్ల విషయంలో దేశ సినీ చరిత్రకే ఎక్కిందనేది! అంటే అత్యంత లాసులను మిగుల్చుకున్న సినిమాగా ఈ సినిమా కొత్త రికార్డులను స్థాపించిందట.

అది ఏ స్థాయి రికార్డు అంటే.. దేశ చరిత్రలోనే అత్యంత డిజాస్టర్లలో రెండో స్థానంలో ఉందట ఈ సినిమా. స్పైడర్ సినిమాకు దాదాపు 40శాతం లాసులు సంభవించాయని సమాచారం. బడ్జెట్ విషయంలో స్పైడర్ అత్యంత భారీ సినిమాగా నిలిచింది. రమారమీ 150కోట్ల రూపాయల బడ్జెట్ సినిమా ఇది. తెలుగు, తమిళ సినిమాల్లో రూపొందించడం.. నిర్మాణ వ్యవధి చాలా ఎక్కువగానే ఉండటం.. తదితర కారణాలతో ఈ సినిమా బడ్జెట్ అమాంతం పెరిగిపోయింది.

హీరో, దర్శకుల రెమ్యూనరేషన్ కూడా భారీగా ఉండటంతో ఈ సినిమా మొత్తం బడ్జెట్ 150కోట్ల రూపాయలను దాటేసిందని తెలుస్తోంది. అంత బడ్జెట్ సినిమా నలభై శాతం వరకూ నష్టాలను మూటగట్టుకుందట. అంటే నష్టం రమారమీ 60కోట్ల రూపాయలు. విశేషం ఏమిటంటే ఈ స్థాయి నష్టాలు పొందిన దక్షిణాది సినిమా మరోటి లేదని టాక్.

అయితే బాలీవుడ్ లో మాత్రం ఇంతకు మించిన స్థాయి నష్టాలు పొందిన సినిమా ఒకటి ఉంది. అదే ‘బాంబే వెల్వెట్’. రణ్ బీర్ కపూర్ హీరోగా అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా అత్యంత భారీ డిజాస్టర్ గా నిలిచింది. దాని నష్టాలు అరవైకోట్ల రూపాయల పైనేనట. దేశ సినీ చరిత్రలోనే డిజాస్టర్లలో నంబర్ వన్ ఆ సినిమా కాగా, రెండోది స్పైడరే అని సమాచారం. ఇదీ స్టార్ హీరోల సినిమాల తీరు. హిట్ అయినా అదే స్థాయిలో, ఫ్లాఫ్ అయినా అదే స్థాయిలో!