పవర్ స్టార్-యంగ్ టైగర్ కలయిక

ఎన్టీఆర్ అభిమానుల చిరకాల కోరిక అది. తమ హీరో, త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరక్షన్ లో చేయాలన్నది. అది ఇప్పటికి నెరవేరుతోంది. ఫిబ్రవరి 2018 లో ప్రారంభమయ్యే ఈ సినిమాకు కొబ్బరికాయ మాత్రం రేపే కొట్టేస్తున్నారు. కార్తీకమాసం…

ఎన్టీఆర్ అభిమానుల చిరకాల కోరిక అది. తమ హీరో, త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరక్షన్ లో చేయాలన్నది. అది ఇప్పటికి నెరవేరుతోంది. ఫిబ్రవరి 2018 లో ప్రారంభమయ్యే ఈ సినిమాకు కొబ్బరికాయ మాత్రం రేపే కొట్టేస్తున్నారు. కార్తీకమాసం మంచి రోజులు వుండడంతో, మళ్లీ తరువాత మూఢం రావడం, సరైన ముహూర్తం లేకపోవడంతో, ఇప్పటే ఓపెనింగ్ చేసేస్తున్నారు. 

సోమవారం నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా ఈ సినిమా ప్రారంభోత్సవం జరుగుతుంది. మెగా-నందమూరి అపూర్వ కలయిక ఇది. చిరంజీవి ఫ్యామిలీకి, నాగార్జున ఫ్యామిలీకి ఎన్టీఆర్ అంటే చాలా అభిమానం. ఈ మధ్యనే రామ్ చరణ్ కూడా ఎన్టీఆర్ ను సతీ సమేతంగా పిలిచి పార్టీ ఇచ్చాడు కూడా. 

ఇప్పుడు ఈ ప్రారంభోత్సవంతో పవర్ స్టార్-యంగ్ టైగర్ ఒక దగ్గరకు రాబోతున్నారు.  పవన్-త్రివిక్రమ్ ఆత్మ పరమాత్మ ల్లాంటివాళ్లు. ఇప్పుడు ఈ ఇద్దరికి ఎన్టీఆర్ కూడా తోడవుతున్నాడు. ఇక ఈ కలయిక ఇలాగే సాగుతుందేమో?