వెయ్యి కోట్ల సినిమాలో కమల్ హాసన్?

భారతదేశంలోనే భారీ బడ్జెట్ మూవీగా వెయ్యి కోట్ల రూపాయల బడ్జెట్ తో రాబోతోంది మహాభారతం. యూఏఈకి చెందిన బడా వ్యాపారవేత్త బీఆర్ షెట్టి ఈ భారీ బడ్జెట్ సినిమాకు నిర్మాత. మోహన్ లాల్ మెయిన్…

భారతదేశంలోనే భారీ బడ్జెట్ మూవీగా వెయ్యి కోట్ల రూపాయల బడ్జెట్ తో రాబోతోంది మహాభారతం. యూఏఈకి చెందిన బడా వ్యాపారవేత్త బీఆర్ షెట్టి ఈ భారీ బడ్జెట్ సినిమాకు నిర్మాత. మోహన్ లాల్ మెయిన్ లీడ్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలోకి ఇప్పుడు కమల్ హాసన్ కూడా ఎంటరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మహాభారతాన్ని తెరకెక్కించనున్న దర్శకుడు వీఏ శ్రీకుమార్ మీనన్ ఈ మేరకు కమల్ హాసన్ తో చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. కమల్ కూడా ఈ బిగ్ ప్రాజెక్టు మూవీలో నటించడానికి ఓకే చెప్పాడట. అయితే కమల్ కు ఆఫర్ చేసిన పాత్ర ఏంటనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

మహాభారతం ప్రాజెక్టులో భీముడిగా కనిపించబోతున్నాడు మోహన్ లాల్. ఈ పాత్ర ఆధారంగానే మహాభారతాన్ని చెప్పబోతున్నారు. ఇక కర్ణుడి పాత్ర కోసం హృతిక్ రోషన్ ను సంప్రదించినట్టు, మరో కీలక పాత్ర కోసం నాగార్జునను కలిసినట్టు వార్తలు వచ్చాయి. మేకర్స్ తమను కలిసినట్టు వీళ్లిద్దరూ నిర్థారించారు కూడా. ఇప్పుడు కమల్ హాసన్ కూడా ఈ ప్రాజెక్టులో చేరితే కేవలం బడ్జెట్ పరంగానే కాకుండా.. స్టార్ కాస్ట్ పరంగా కూడా బిగ్ ప్రాజెక్టుగా మారుతుంది మహాభారతం.

కోలీవుడ్ నుంచి సూర్య, బాలీవుడ్ నుంచి అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్స్ ను కూడా ఈ ప్రాజెక్టులో భాగం చేసేందుకు దర్శకుడు ప్రయత్నిస్తున్నాడు. మరోవైపు ఈ ప్రతిష్టాత్మక సినిమాకు సంగీతం అందించేందుకు ఏఆర్ రెహ్మాన్ సంసిద్ధత వ్యక్తంచేసిన విషయం తెలిసిందే.