సుకుమార్ బ్యానర్ అనగానే మరి మాట్లాడడానికి, ఆలోచించడానికి ఏమీ వుండదు. అందుకే అయిదు కోట్ల వ్యయంతో ఆ బ్యానర్ పై సినిమా తీస్తే, కొత్త డైరక్టర్, కొత్త హీరో అని కూడా చూడకుండా నైజాం ఏరియాకు రెండు కోట్లకు కాస్త అటు ఇటుగా రేటు ఇచ్చి కొనేసారు డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు. ఇప్పుడు తీరా చూస్తే దర్శకుడు సినిమా డిజాస్టర్ అయిపోయింది. మొత్తం డబ్బులు పోయే పరిస్థితి.
అయితే ఇక్కడ చినపాటి అదృష్టం కలిసి వచ్చింది. కోటి రూపాయిల వరకు రిటర్న్ గ్యారంటీని నిర్మాతలు ఇచ్చారు. అంటే కోటి రూపాయిలు వెనక్కు వస్తాయి. కానీ మిగిలిన కోటి మాత్రం హుష్ కాకి అన్నమాట. ఓ పక్క తను నిర్మించిన ఫిదా సినిమా డబ్బులు తెస్తుంటే, సంచి లాభం చిల్లి కూడదీసినట్లు, దర్శకుడు లాంటి సినిమాలు పట్టుకుపోతున్నాయి.
సుకుమార్ పేరు, కుమారి 21 ఎఫ్ హిట్ నేపథ్యంలో దర్శకుడు సినిమాను బాగానే మార్కెట్ చేసారు. మరి మిగిలిన ఏరియాల బయ్యర్ల పరిస్థితి తెలియాల్సి వుంది.