ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి

హీరోయిన్ల కెరీర్ నీటిబుడగ లాంటిది. ఇలా ఎదిగిన మరుక్షణమే అలా క్రేజ్ మాయమైపోతుంది. లాంగ్ రన్ నిలబడే హీరోయిన్లు చాలా తక్కువ. ఇప్పుడు మనం చెప్పుకోబోయే హీరోయిన్ పరిస్థితి కూడా ఇలానే తయారైంది. Advertisement…

హీరోయిన్ల కెరీర్ నీటిబుడగ లాంటిది. ఇలా ఎదిగిన మరుక్షణమే అలా క్రేజ్ మాయమైపోతుంది. లాంగ్ రన్ నిలబడే హీరోయిన్లు చాలా తక్కువ. ఇప్పుడు మనం చెప్పుకోబోయే హీరోయిన్ పరిస్థితి కూడా ఇలానే తయారైంది.

ఒకప్పుడు సూపర్ హిట్ అనిపించుకున్న ఈ ముద్దుగుమ్మ, ఆ తర్వాత వరుస ఫ్లాపులతో ఉక్కిరిబిక్కిరైంది. ఒకప్పుడు రోజుకు 3 షిఫ్టుల మీద పనిచేస్తూ బిజీగా ఉన్న ఈ భామ, ఇప్పుడు ఒక్కసారిగా ఖాళీ అయింది. స్టార్ డమ్ రుచి మరిగిన తర్వాత ఖాళీగా ఇంట్లో కూర్చోడం ఓ పట్టాన కుదరదు.

ఇప్పుడీ ముద్దుగుమ్మ అదే బాధలో ఉంది. ఓవైపు అవకాశాలు రాక, మరోవైపు క్రేజ్ ను కొనసాగించడం కోసం రోజుకో ఫొటోషూట్ చేస్తోంది. ఈ క్రమంలో కొంతమంది ఇండస్ట్రీ జనాలకు పరోక్షంగా కొన్ని సిగ్నల్స్ అందించింది.

మొన్నటివరకు పద్ధతైన పాత్రలు పోషించిన ఈ హీరోయిన్, కాస్త బోల్డ్ గా ఉండే పాత్రలైనా ఓకే అంటోంది. స్కిన్ షో చేయడానికి రెడీ అని, అవసరమైతే లిప్ కిస్ సన్నివేశాల్లో కూడా నటిస్తానని చెబుతోంది.

ఈమధ్య ఓ సినిమా ఆఫర్ వచ్చింది. అందులో హీరోయిన్ ది బోల్డ్ పాత్ర. నటించడానికి ఈమెకు ఎలాంటి అభ్యంతరం లేదు. కాకపోతే అలాంటి బోల్డ్ క్యారెక్టర్లు, స్కిన్ షోలు చేయాలంటే కాస్త పేరున్న హీరో సినిమా అయి ఉండాలనేది ఈమె కండిషన్. దాంతో ఆ ఆఫర్ వెనక్కు వెళ్లిపోయింది.