భైరవకోన- కొత్త తరహా ఫాంటసీ

యంగ్ హీరో సందీప్ కిషన్ మ్యాజికల్ ఫాంటసీ అడ్వెంచర్ మూవీ 'ఊరు పేరు భైరవకోన'. విఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ కథానాయికలుగా నటించారు. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్…

యంగ్ హీరో సందీప్ కిషన్ మ్యాజికల్ ఫాంటసీ అడ్వెంచర్ మూవీ 'ఊరు పేరు భైరవకోన'. విఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ కథానాయికలుగా నటించారు. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా లావిష్ స్కేల్ లో నిర్మించారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై అనిల్ సుంకర సమర్పిస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 16న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపధ్యంలో నిర్మాత రాజేష్ దండా 'ఊరు పేరు భైరవకోన' విశేషాలని విలేకరుల సమావేశంలో పంచుకున్నారు.

దర్శకుడు విఐ ఆనంద్ చెప్పిన కథ చాలా డిఫరెంట్ గా అనిపించింది. కొత్త కంటెంట్ తో కొత్త జోనర్ లో సినిమా చేస్తే ఆ సినిమా సక్సెస్ అవుతుంది, క్రేజ్ వస్తుందని నమ్మి చేశాం. ఈ రోజు మా నమ్మకం నిజమైయింది. సందీప్ కిషన్ కెరీర్ లో హయ్యట్ బడ్జెట్ సినిమా ఇది. అలాగే హయ్యస్ట్ బిజినెస్ సినిమా కూడా ఇదే. విడుదలకు ముందు చాలా హ్యాపీగా వున్నాం. ఆనంద్ చెప్పిన దానికి రెండింతల అద్భుతంగా సినిమాని తీశారు.

నచ్చిన కథలు చేసుకుంటూ వెళ్తున్నాం. 'ఊరు పేరు భైరవకోన'తో సక్సెస్ ట్రాక్ ని కొనసాగించి హ్యాట్రిక్ కొడతామనే నమ్మకం వుంది. ప్రీమియర్ షోలన్నీ ఫుల్ అయ్యాయి. హైదరాబాద్ లో ప్రముఖ సింగిల్ స్క్రీన్స్ లో ప్రీమియర్స్ అన్నీ ఫుల్ కావడం ఈ సినిమాపై వున్న క్రేజ్ కి అద్దం పడుతున్నాయి.

'ఊరు పేరు భైరవకోన' ఫాంటసీ థ్రిల్లర్. మన ఊర్లో ఏం జరుగుతుందో మనికి తెలుసు. కానీ 'భైరవకోన' అనే ఊరులో కొత్తగా వెరైటీగా ఎవరూ ఊహించిన సంఘటనలు జరుగుతుంటాయి. అది నాకు చాలా ఆసక్తిని కలిగించింది. అలాగే గరుడపురాణంలో మిస్ అయిన పేజీలకి ఈ కథకి వున్న లింక్ ఏమిటనేది కూడా చాలా ఆసక్తిగా వుంటుంది. సినిమాలో 47 నిమిషాల అద్భతమైన సిజీ వర్క్ వుంది. విజువల్స్ చాలా గ్రాండ్ గా వుంటాయి. ప్రేక్షకులకు చాలా గొప్ప థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ని ఇచ్చే చిత్రమిది.

డైరెక్టర్ గారు చెబితే ఖచ్చితంగా వుంటుంది. అయితే ఇందులో మాత్రం సీక్వెల్ లీడ్ లాంటి ఏమీ ఇవ్వడం లేదు. ఈ కథకు సీక్వెల్, ప్రీక్వెల్ చేయొచ్చు. రెండు ఆలోచనలు వున్నాయి.

శేఖర్ చంద్ర తన ప్రతి సినిమాలో చాలా మంచి పాటలు ఇస్తారు. ఇందులో నిజమేనా చెబుతున్న పాట చాలా వైరల్ అయ్యింది. నిజానికి ఈ ట్యూన్ శేఖర్ దగ్గర ఐదేళ్ళుగా వుంది. చాలా మందికి వినిపించాడు. ఫైనల్ సందీప్ కిషన్ విని దర్శకుడిని వినమన్నారు. అలా ఆ పాట మాకు రావడం చాలా లక్కీ. ఇందులో నేపధ్య సంగీతం కూడా అద్భుతంగా వుంటుంది.

‘భైరవకోన' ఊరు గురించి చెప్పడం ఆసక్తికరంగా వుంటుంది. తర్వాత ప్రీ ఇంటర్వెల్, ఇంటర్వెల్ ట్విస్ట్ అద్భుతంగా వుంటాయి. 'భైరవకోన'లోకి ఎంటరైన తర్వాత జర్నీ అంతా థ్రిల్లింగా వుంటుంది.