ఈగిల్ స్టయిలిష్ మాస్ మూవీ

మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఈగల్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, వివేక్ కూచిభొట్ల…

మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఈగల్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫిబ్రవరి 9న ఈగల్ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ 'ఈగల్' విశేషాలని విలేకరుల సమావేశంలో పంచుకున్నారు.

మా సంస్థ నుంచి వచ్చిన 'ధమాకా' మాస్ ఎంటర్ టైనర్ ఐతే.. ‘ఈగల్’ చాలా క్లాసిక్ స్టయిలీష్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్. ఇందులో ఎంటర్ టైన్మెంట్ భేస్ మాస్ వుంది. ఈగిల్ కంటెంట్ అద్భుతంగా వుంటుంది. ఆడియన్స్ ని అలరించే చాలా మంచి ఎలిమెంట్స్ వున్నాయి. ఖచ్చితంగా ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు. రవితేజ సరికొత్తగా కనిపించబోతున్నారు. కథ, మెసేజ్, యాక్షన్, సాంగ్స్ అన్నీ ఎక్స్ ట్రార్డినరీ గా వుంటాయి.

రవితేజ తో మాకు ఎక్స్ ట్రార్డినరీ రిలేషన్ షిప్ వుంది. ఆ రిలేషన్ షిప్ తోనే ఆయనతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాం. కార్తీక్ ఘట్టమనేని తో ఎప్పటినుంచో మా అనుబంధం వుంది. ధమాకా జరుగుతున్న సమయంలోనే ఈ ప్రాజెక్ట్ ప్లాన్ చేశాం. 'ఈగిల్' ని అద్భుతంగా తీశారు. మా నిర్మాణంలో మరో సినిమా చేస్తున్నాం. త్వరలోనే అనౌన్స్ చేస్తాం.

పరిశ్రమ మేలుని ద్రుష్టిలో పెట్టుకొని సంక్రాంతి బరి నుంచి వెనక్కు తగ్గాం. ట్రేడ్ విషయానికి వస్తే అప్పుడు మేము సెకండ్ బెస్ట్.. ఇప్పుడు నెంబర్ వన్. మిగతా చిత్రాలు వేటి రీచ్ వాటికి వున్నాయి.

మా బ్యానర్ లో 15 సినిమాలు నిర్మాణంలో వున్నాయి. ఇవి ప్రీ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ లో వున్నాయి. ప్రొడక్షన్ లో దాదాపు ఆరు చిత్రాలు వున్నాయి. ఇవి కాకుండా ఈ టీవీ విన్ కోసం కొన్ని చిత్రాలు నిర్మాణం అవుతున్నాయి. అలాగే దాదాపు నాలుగు సినిమాలు అమెరికాలో చేస్తున్నాం. ప్రతి నెల మా నుంచి ఒక చిత్రం విడుదల కానుంది. ఈ ఏడాది 50 మైలు రాయిని అందుకుంటామని భావిస్తున్నాం.