యాత్ర 2.. మహీ కోసం చూడాలి

యాత్ర 2 సినిమా వైఎస్ జగన్ బయోపిక్. మరి ఆ సినిమాను డైరక్టర్ మహి కోసం చూడడం ఏమిటి? చాలా సినిమాలను హీరో కోసం చూస్తాము. మరి కొన్ని సినిమాలు డైరక్టర్ కోసం చూస్తాము.…

యాత్ర 2 సినిమా వైఎస్ జగన్ బయోపిక్. మరి ఆ సినిమాను డైరక్టర్ మహి కోసం చూడడం ఏమిటి? చాలా సినిమాలను హీరో కోసం చూస్తాము. మరి కొన్ని సినిమాలు డైరక్టర్ కోసం చూస్తాము. ఇంకోన్ని సినిమాలను కాంబినేషన్ కోసం చూస్తాము. ఆ లెక్కల్లో చూసుకుంటే యాత్ర 2 సినిమాను దర్శకుడు మహి వి రాఘవ కోసం చూడాలి.

బయోపిక్ లు ఇలా తీయాలి అనే రాజ్యాంగం రాసినట్లు మహానటి సినిమా తీసి చూపించాడు నాగ్‌ అశ్విన్. పొలిటికల్ బయో పిక్ లు ఇలా వుండాలి అనేలా యాత్ర సినిమాను తీసి చూపించాడు మహి. ఒక నాయకుడి జీవితాన్ని సుతారంగా, సున్నితంగా, ఎక్కడ ఏ పాయింట్ లో లేపాలో, ఏ పాయింట్ దగ్గర హైలైట్ చేయాలో అన్నది యాత్ర సినిమా చూస్తే తెలుస్తుంది.

పోలిటిక‌ల్ సినిమా అంటే అరుపుల కేకల, భీషణ ప్రతిజ్ఙల పంచ్ డైలాగులు అవసరం లేదు, జనాల గుండెల్లో నాటుకునే మాటల తూటాలను వేరే విధంగా కూడా రాయొచ్చు అని రాసి చూపించాడు మహి.

యాత్ర 2 ట్రయిలర్ వచ్చింది. సినిమా ఎలా వుంటుంది. ట్రయిలర్ ఎలా వుంది అన్న విషయాలు పక్కన పెడితే ట్రయిలర్ ను కూడా ఎలా లేపాలో, ఎక్కడ లేపాలో అక్కడ లేపాడు దర్శకుడు. డబ్బు సమస్య మనకు అర్థం అవుతుంచి.. చిన్న పాపకు కాదు అన్న డైలాగుతో, కడపోడు సర్..పగతీర్చుకోవాలి అనుకున్నాక, తను నాశనం అయిపోతానని తెలిసినా ముందకెే వెళ్తాడు అన్న చోట.., అన్నింటికీ మించి, యాత్రలో పాపులర్ డైలాగ్..నేను విన్నాను.. నేను ఉన్నాను.. ను మళ్లీ రిపీట్ చేయడానికి క్రియేట్ చేసిన సన్నివేశం.. ఈ మూడూ చాలు ఒక మంచి పొలిటికల్ బయోపిక్ చూడబోతున్నాము అని తెలియడానికి.

అదే సమయంలో పొలిటికల్ బయోపిక్ తీస్తున్నపుడు, మాస్ కోసం, క్రేజ్ కోసం, ఎలివేట్ చేయాలనుకున్న నాయకుడి వ్యతిరేక వర్గం మీద కాసిన్ని సీన్లు, మాటలు పడేయడం మామూలు. కానీ మహి అది కూడా చేయలేదు. కేవలం తాను ఏం చెప్పాలనుకున్నాడో, ఏం చూపించాలనుకున్నాడో అదే దారిన వెళ్లాడు తప్ప, కవ్వింపులు, కత్తులు నూరడాలు చేయలేదు.

యాత్ర 2 ఇది జగన్ బయోపిక్. కానీ ఇది మహి రాఘవ సినిమా.