నాగ్ మళ్లీ యాక్షన్ సినిమా?

మన హీరోలు ఎన్ని సినిమాలు చేసినా మరొక్కసారి మరో యాక్షన్ సినిమా చేయాలని లేదా మరో మాస్ మూవీ చేయాలని కోరిక పుడుతూనే వుంటుంది. Advertisement విక్టరీ వెంకటేష్‌ను ఫ్యామిలీ సినిమాల్లో చూస్తామంటారు అభిమానులు.…

మన హీరోలు ఎన్ని సినిమాలు చేసినా మరొక్కసారి మరో యాక్షన్ సినిమా చేయాలని లేదా మరో మాస్ మూవీ చేయాలని కోరిక పుడుతూనే వుంటుంది.

విక్టరీ వెంకటేష్‌ను ఫ్యామిలీ సినిమాల్లో చూస్తామంటారు అభిమానులు. ఆయన మాత్రం అది తప్ప రకరకాలు ట్రయ్ చేస్తూ, విఫలమవుతూ వుంటారు. హీరో నాగ్‌ను సరదా సరదా సినిమాల్లో చూడాలనుకుంటారు జనాలు. ఆయన మాత్రం ఇంకా యంగ్ హీరోలా మాస్ యాక్షన్ సినిమాలు చేయాలనుకుంటారు.

సోగ్గాడే చిన్ని నాయనా, బంగార్రాజు తరువాత నా సామి రంగా సినిమాతో హిట్ కొట్టారు. ఈ మధ్యలో చాలా ఫ్లాపులు చూసారు. అవేవీ ఈ జానర్ సినిమాలు కావు. ఇప్పుడు ఓ థ్రిల్లర్ సినిమా శేఖర్ కమ్ముల డైరక్షన్ లో చేస్తున్నారు. దాని తరువాత మళ్లీ ఓ యాక్షన్ సినిమా చేసే ఆలోచనలో వున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

నిర్మాత జ్ఙాన్ వేల్ రాజా తీసుకువచ్చిన నవీన్ అనే తమిళ దర్శకుడి స్క్రిప్ట్ నాగ్ కు బాగా నచ్చిందని తెలుస్తోంది. దాని మీద పూర్తిగా ఏ నిర్ణయం తీసుకోలేదు కానీ, చేసే అవకాశం వుందని తెలుస్తోంది.