రామ్ చరణ్ కొత్త సినిమాలో, ఆయనతో పాటు కలిసి నటించే అద్భుతమైన అవకాశం. అయితే ఈ అవకాశం కేవలం ఉత్తరాంధ్ర వాసులకు మాత్రమే.
అవును.. చరణ్-బుచ్చిబాబు సినిమా కోసం ఉత్తరాంధ్ర యాసలో అనర్గలంగా డైలాగ్స్ చెప్పే నటీనటులు కావాలి. దీని కోసం బుచ్చిబాబు అండ్ టీమ్ ఈ నెల్లోనే ఉత్తరాంధ్రలో పర్యటించనుంది.
ఈ సినిమా కోసం ఒకరు, ఇద్దరు కాదు, ఏకంగా 400 మంది ఆర్టిస్టులు కావాలి. వీళ్లలో ఎక్కువమంది ఉత్తరాంధ్ర వాసులే ఉండాలి. అందుకే ఈనెల 5 నుంచి 17వ తేదీ వరకు ఉత్తరాంధ్రకు చెందిన విశాఖ, విజయనగరం, సాలూరు, శ్రీకాకుళంలో టీమ్ పర్యటించబోతోంది.
బుచ్చిబాబు దర్శకత్వంలో త్వరలోనే సెట్స్ పైకి రాబోతోంది ఈ సినిమా. తాజా కాస్టింగ్ కాల్ తో ఇది ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో నడిచే సినిమా అనే అంశంపై స్పష్టత వచ్చింది.
కెరీర్ లో రామ్ చరణ్ కు ఇది 16వ చిత్రం. గేమ్ ఛేంజర్ షూట్ కంప్లీట్ అయిన వెంటనే ఇది మొదలవుతుంది. ఈ సినిమాకు ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించబోతున్నాడు.