రెండుసార్లు విజయవాడ లోక్ సభ సభ్యుడిగా తెలుగుదేశం పార్టీ తరఫున గెలుపొందడంతోపాటు.. ఆ పరిధిలో తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థుల విజయానికి కూడా ఎంతో కీలకంగా వ్యవహరించిన నాయకుడు కేశినేని నానిని చంద్రబాబు నాయుడు ఇటీవలే వదిలించుకున్నారు. దానిని మించి పార్టీకి ఉపయోగపడే నాయకులు మరొకరు ఆయనకు కనిపించారో ఏమో తెలియదు గానీ, అత్యంత అవమానకరమైన రీతిలో, పార్టీ సభకు హాజరు కావద్దని సందేశం పంపడం ద్వారా కేశినేని నానిని బయటకు గెంటేశారు. వేరే ప్రత్యామ్నాయం లేని ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ తరఫున ఈసారి బరిలో ఉండబోతున్నారు.
చంద్రబాబునాయుడు చేసిన వంచన గురించి అందరికంటే ఎక్కువగా స్పృహ ఉన్న వ్యక్తి కేశినేని నాని. ఆయన బాబు తీరు మీద ఒక రేంజ్ లో విమర్శలు గుప్పిస్తున్నారు. చంద్రబాబు నాయుడుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన రాజధానిగా చెబుతున్న ప్రాంతంలో ఇప్పటిదాకా ఒక సొంత ఇల్లు కూడా లేదనేది నాని ప్రధానంగా లేవనెత్తుతున్న విమర్శ.
నిజం చెప్పాలంటే చంద్రబాబుకు సొంత ఇల్లు ఏర్పాటు చేసుకునే ఉద్దేశం కూడా లేదని నాని అంటున్నారు. ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో ఓటమి తర్జుమా అనే సంగతి ఆల్రెడీ ఆయన గ్రహించారని విశ్లేషిస్తున్నారు. చంద్రబాబు నాయుడుకు రాబోయే ఎన్నికల్లో గెలుస్తామని నమ్మకం ఎంత మాత్రమూ లేదని.. అమాయకంగా పార్టీ టికెట్ల కోసం వెంపర్లాడే వారికి ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు నమ్ముకుని డబ్బు పోగు చేసుకునే ఉద్దేశంతో ఉన్నారని కేశినేని నాని చెబుతున్నారు.
పార్టీ టికెట్లు అమ్మకం ద్వారా సేకరించే కోట్లాది రూపాయలను తీసుకొని హైదరాబాద్ వెళ్ళిపోతారు అనేది ఆయన విమర్శ. ఈ డబ్బులు మాత్రమే కాకుండా ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు విజయవాడ నుంచి మొత్తం మూటాముల్లే ఖాళీ చేసి వెళ్లిపోతారని ఆయన చెబుతున్నారు!
చంద్రబాబు నాయుడు ఏదో ఉద్ధరిస్తాడని, తమ నెత్తిన కిరీటం పెడతాడని.. అధికారం కోసం ఆరాటపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కేవలం తెలుగుదేశం పార్టీ టికెట్ల కోసం ఆరాటపడుతున్న వారు మాత్రమే కాదు.. ఆయనను అధికారంలోకి తీసుకురావడానికి, ఆయన పల్లకి మోయడానికి సిద్ధంగా ఉన్న పవన్ కళ్యాణ్ కూడా అదే కోవకు చెందుతారు!
కేశినేని నాని మాటలే నిజమైతే.. టికెట్లు అమ్ముకునే సొమ్ముతో చంద్రబాబు నాయుడు మూటా ముల్లే సర్దుకుని పరారయితే, అప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి వారు నిర్మించుకుంటున్న ఆశల సౌధాలన్నీ.. పేక పేకమేడల్లాగా కూలిపోక తప్పదేమో!