హనుమాన్.. ఆరు కోట్ల కారు

టాలీవుడ్ ఓ చిత్రమైన ఇండస్ట్రీ. స్ట్రగుల్ పడడం ఇక్కడే.. సక్సెస్ ఇక్కడే. ఆ సక్సెస్ తో వచ్చే సిరి.. సంపద ఇక్కడే. అందుకే ఒక్క చాన్స్ అంటూ ఎదురు చూసినట్లుగానే, ఒక్క సక్సెస్ అంటూ…

టాలీవుడ్ ఓ చిత్రమైన ఇండస్ట్రీ. స్ట్రగుల్ పడడం ఇక్కడే.. సక్సెస్ ఇక్కడే. ఆ సక్సెస్ తో వచ్చే సిరి.. సంపద ఇక్కడే. అందుకే ఒక్క చాన్స్ అంటూ ఎదురు చూసినట్లుగానే, ఒక్క సక్సెస్ అంటూ తపిస్తారు నటులైనా, దర్శకులైనా.. నిర్మాతలు అయినా. అలాంటి సక్సెస్ ఒక్కటి సరైనది పడితే ఇక లైఫ్ ఎక్కడో వుంటుంది. డబ్బుకు లోటుండదు. అవకాశాలకు కొదవ వుండదు.

హనుమాన్ సినిమాతో దర్శకుడు ప్రశాంత్ వర్మ కొట్టిన హిట్ ఇలాంటి అలాంటిది కాదు. 40 కోట్ల పెట్టుబడికి వంద కోట్ల లాభం ఇచ్చిన సినిమా. ఇలాంటి ఫీట్ సాధించిన దర్శకులు చాలా కొద్ది మంది వుంటారు. పైగా హనుమాన్ సినిమాలో ఇంతో అంతో వాటా కూడా వుంది ప్రశాంత్ వర్మకు.

సినిమా సక్సెస్ తో బాలీవుడ్ నుంచి ఆఫర్లు.. టాలీవుడ్ నుంచి ఆఫర్లు. అందువల్ల డబ్బుకు కొదవ లేదు. ఇలాంటపుడే కదా ఎప్పటి నుంచో అణచిపెట్టుకున్న కోరికలు ఏమైనా వుంటే తీర్చుకోవడం.

అందుకే ఓ లగ్జరీ కారు బుక్ చేసినట్లు తెలుస్తోంది రేంజ్ రోవర్- ఆటో బయోగ్రఫీ లో హైఎండ్ వెర్షన్ ఏదో ఒకటి బుక్ చేసారని, దాని విలువ ఆరు కోట్లు వుంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం మంచి బెంజ్ కారును వాడుతున్నారు ప్రశాంత్ వర్మ. తను బుక్ చేసిన కారు వస్తే, ఇక దాంట్లో వెళ్తూ కనిపిస్తారన్న మాట.