రామ్ చరణ్-శంకర్ కాంబినేషన్ లో నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న అత్యంత భారీ చిత్రం గేమ్ ఛేంజర్. ఈ సినిమా విడుదల ఎప్పుడు అన్నది ఓ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే దర్శకుడు శంకర్ సినిమాను ఎప్పుడు పూర్తి చేస్తారో అన్నది క్లారిటీ లేదు కనుక. ఈ సినిమా ఓవర్ సీస్ హక్కుల విషయంలో డిఫెరెంట్ వెర్షన్లు వినిపిస్తున్నాయి.
27 అని నిర్మాత దిల్ రాజు చెబుతుంటే 22 అని మరో వెర్షన్ వినిపిస్తోంది. ఇలా వినిపించడానికి కారణం లేకపోలేదు. ఈ సినిమా ఓవర్ సీస్ హక్కులు ఎప్పుడో 22 కోట్లకు ఫార్స్ ఫిలింస్ సంస్థకు విక్రయించేసారని తెలుస్తోంది. అయితే సినిమా ఆలస్యం కావడంతో ఫార్స్ సంస్థ కాస్త ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దాంతో వడ్డీతో సహా వెనక్కు ఇచ్చి, వేరే వాళ్లకు అమ్మే ఆలోచన నిర్మాత దిల్ రాజు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ మేరకు ఒకరిద్దరు ఓవర్ సీస్ బయ్యర్లను సంప్రదించినట్లు తెలుస్తోంది. అందుకే 27 కోట్ల కోట్ చేస్తున్నారని తెలుస్తోంది. గతంలో రేటు వేరు, ఇప్పుడు మారిన మార్కెట్ పరిస్థితుల్లో ఇప్పుడి రేటు వేరు అని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
గేమ్ ఛేంజర్ సినిమా చాలా వరకు పూర్తయింది. ఇండియన్ 2 సినిమాను కూడా సమాంతరంగా తీయాల్సి రావడంతో ఆలస్యం అవుతోంది. ఈ ఏడాది సమ్మర్ కు కాస్త అటు ఇటుగా థియేటర్లలోకి వస్తుందని తెలుస్తోంది.