డైరక్టర్ కు అర్థరాత్రి క్లాస్!

ఆయనో సీనియర్ హీరో. అతగాడో మాస్ డైరక్టర్. ఇద్దరూ కలిసి సినిమా చేస్తున్నారు. ఔట్ డోర్ షూటింగ్ జరుగుతోంది. నైట్ షూట్. ఏదో తేడా వచ్చింది. అంతే హీరో క్లాస్ పీకడం మొదలుపెట్టారు. Advertisement…

ఆయనో సీనియర్ హీరో. అతగాడో మాస్ డైరక్టర్. ఇద్దరూ కలిసి సినిమా చేస్తున్నారు. ఔట్ డోర్ షూటింగ్ జరుగుతోంది. నైట్ షూట్. ఏదో తేడా వచ్చింది. అంతే హీరో క్లాస్ పీకడం మొదలుపెట్టారు.

ఇటు డైరక్టర్‌కు అటు సినిమాటోగ్రాఫర్ కు. మామూలు క్లాస్ కాదు. మధ్యలో అక్కడక్కడ బూతుల పంచాంగమే. ఇలాంటి వేషాలు వేస్తేనే ఇంతకు ముందు చేసిన సినిమా డైరక్టర్ కు, సినిమాటోగ్రాఫర్ కు గట్టిగా ఇచ్చాను అంటూ రిఫరెన్స్ లు కూడా.

కాస్త ఆలస్యంగా బయటకు వచ్చిందీ వ్యవహారం. దర్శకుడి పని తీరు పట్లనో, స్క్రిప్ట్ పట్లనో హీరో అసంతృప్తిగా వున్నట్లు గుసగుసలు వున్నాయి. ఇప్పటికే స్క్రిప్ట్ చాలా వరకు మార్చారని కూడా గ్యాసిప్ లు వున్నాయి. దీనికి తోడు అర్థరాత్రి వేళ ఈ క్లాస్ అదనం.

మొత్తం మీద ఏదో విధంగా అవుట్ డోర్ షూట్ ముగించుకు వచ్చారు. ఇక్కడ షూట్ మొదలైంది అనుకుంటే మళ్లీ ఓ రోజు క్యాన్సిల్. ఇలా అడుగు ముందుకు, అడుగు వెనక్కు అన్నట్లు సాగుతోంది ఆ సినిమా వ్యవహారం అని టాలీవుడ్ లో బలంగా వినిపిస్తోంది. అయినా అలాగే ఊపుతాపులు పడుతూ దాదాపు అరగంట ఫుటేజ్ ఇప్పటికే లాగేసాడు దర్శకుడు. గట్టివాడే.