మహాసేన రాజేష్ తప్పుకుంటావా? తప్పించాలా?

మనిషికి మరుపు ఒక వరం. అలానే అదే శాపం కూడా. ఎందుకంటే మహాసేన రాజేష్ టీడీపీ సీట్ వదులుకుంటున్నాను అని ఒక వీడియో పెట్టగానే తెగ బాధపడిపోతున్నారు టీడీపీని సమర్ధించేవారు. కామెడి ఏమిటంటే వాడు…

మనిషికి మరుపు ఒక వరం. అలానే అదే శాపం కూడా. ఎందుకంటే మహాసేన రాజేష్ టీడీపీ సీట్ వదులుకుంటున్నాను అని ఒక వీడియో పెట్టగానే తెగ బాధపడిపోతున్నారు టీడీపీని సమర్ధించేవారు. కామెడి ఏమిటంటే వాడు తిట్టిన ఆడపిల్లల్లో వీళ్ళ ఇంటి ఆడపిల్లలు కూడా ఉన్నారు. అయినా పర్వాలేదు అని తుడిచేసుకుంటున్నారేమో వీళ్ళు.

రాజకీయంగా ఎవరు ఎవరిని తిడుతున్నారు అనేది మనకి అనవసరం. మహాసేన రాజేష్ హిందూ అమ్మాయిలను తిట్టాడు అనేదే ఇక్కడ పాయింట్. ఇకపోతే రాజేష్ తన గన్నవరం సీటు వదులుకుంటున్నాను అనడానికి నాకు రెండు కారణాలలో ఏదో ఒకటి అయుంటుంది అనిపిస్తుంది. అవి..

1. తాను ఈ సీటు వదులుకుంటున్నాను అని చెప్పి సింపతి క్రియేట్ చేసుకుని తన పై ఉన్న వ్యతిరేకత తగ్గించుకోవడం. టీడీపీ వాళ్ళు అయ్యో అంత పని చేయకు అని బ్రతిమిలాడి తిరిగి పోటీ చేసేటట్టు చేయడం. ఇదంతా నాటకంలో భాగమే.

2. ప్రస్తుతం వస్తున్న వ్యతిరేకత ఎందుకులే తలనొప్పి, అసలే బీజేపీ కూడా పొత్తులో చేరేటట్టు ఉంది అని రాజేష్ ని టీడీపీ నే తప్పుకోమని చెప్పి తప్పించడం, ఎన్నికలలో గెలిచాక ఏదో ఒక పదవి అప్పజెబుతాములే అని ప్రామిస్ చేయడం. ఎలాగూ తన తప్పిదం వలనే ఇంత వ్యతిరేకత వచ్చింది కనుక ఇక ఏమీ చేయలేక రాజేష్ ప్రక్కకి తప్పుకోవడం.

ఈ రెండిటిలో ఏదో ఒకటి జరిగి ఉండాలి. ఇంకొక ముఖ్య విషయం. రాజేష్ ఏదో తాను దళితుడిని కనుక అణిచివేస్తున్నారు అని సింపతీ తెచ్చుకునే మాటలు ఆడుతున్నాడు. నిజానికి ఆయన క్రైస్తవుడు. ఇప్పటికే అనేక సందర్భాలలో అనేక వీడియోలలో ఒప్పుకున్నాడు. ఒక దళితుడు క్రైస్తవ మతంలోకి పోతే అతడు దళిత రిజర్వేషన్ వదులుకోవలసి వస్తుంది. అతడు BC C గా పరిగణించబడతాడు. మరి ఒక BACKWARD CASTE కి చెందిన రిజర్వేషన్ గల రాజేష్ SC రిజర్వుడ్ సీట్ కి ఎలా పోటీ చేయగలుగుతాడు?

టీడీపీ ఆ సీట్ ని రాజేష్ కి ఎలా ఇచ్చింది?? ఇది రాజ్యాంగ విరుద్ధమే కాదు. చట్ట విరుద్ధం కూడా. టీడీపీ, మహాసేన రాజేష్ ఎన్ని డ్రామాలు ఆడినా హిందువులను తిట్టిన రాజేష్ కు హిందూ ఓటర్లే తగిన బుద్ది చెబుతారు. కనుక రాజేష్ మర్యాదగా గన్నవరం సీటు నుండి తప్పుకోవడమే మంచిది. 

భాస్కర్ కిల్లి